2022లో విడుదలై తెలుగు, తమిళ, కన్నడ ప్రేక్షకులను కదిలించిన రిషబ్ శెట్టి కాంతారా కి ప్రిక్వెల్ వచ్చింది… హిట్ అయ్యింది… బ్లాక్బస్టర్ కూడా అయ్యింది.
భారీ అంచనాల మధ్య, కాంతారా: చాప్టర్ 1 అక్టోబర్ 2న బాక్సాఫీస్‌లో అద్భుతమైన ఓపెనింగ్ సాధించింది. పండుగ సీజన్ ఇంకా లాంగ్ వీకెండ్‌ను పూర్తి ఉపయోగించుకుని, సినిమా అన్ని ప్రాంతాల్లో బాగానే వసూలు చేసింది. ప్రేక్షకుల ప్రశంసలు, పాజిటివ్ రివ్యూస్ ఫిల్మ్ గ్రోత్‌కు ప్రధాన కారణం.
మేకర్స్ ప్రకారం, తొలి వారం చివరికి సినిమా 500 కోట్ల గ్రాస్ సాధించింది. కన్నడలో దీని లైఫ్‌టైమ్ కలెక్షన్స్ ఫస్ట్ పార్ట్‌ను మించనున్నాయి. అయితే, తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు మార్కెట్లలో కూడా సినిమా బాగా ఆడింది అందుకే ఆ కలెక్షన్స్ వచ్చాయి…
హిందీ వెర్షన్ ప్రారంభం నుంచి promising revenues ఇచ్చినా, మొత్తం కలెక్షన్స్ pre-release హైప్‌లను సమానంగా అందించలేకపోయాయి. సో, ఇప్పుడు 1000 కోట్ల క్లబ్‌లో చేరాలంటే, హిందీ మార్కెట్ ఇంకా ఓవర్సీస్ వసూలు కీలకంగా ఉంటుంది. బాహుబలి 2, KGF, పుష్ప 2, RRR, కల్కి 2898AD ఇలా పెద్ద సినిమాలు ఈ ఫార్ములా నే పాటించి 1000 కోట్ల కలెక్షన్ సాధించాయి…
ప్రస్తుత ట్రెండ్ చూస్తే, కాంతారా 1000 కోట్లు చేరడం కష్టమే, మొత్తం రన్ 700–800 కోట్లు దగ్గరగా ముగియవచ్చని అంచనా. ఎందుకంటే ఇంకో వారం రోజుల్లో దీపావళి కాబట్టి, ఒక మూడు నాలుగు పెద్ద సినిమాలు లైన్ లో ఉన్నాయ్…