హోంబలే ఫిలిమ్స్ నుంచి వస్తున్న తదుపరి భారీ ప్రాజెక్ట్ కాంతారా ఛాప్టర్ 1. రిషబ్ శెట్టి హీరోగా, తానే డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రీక్వెల్‌కి ట్రైలర్ నుంచే భారీ క్రేజ్ వచ్చింది. ఇప్పుడు మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసి, మొదటి పాట ‘బ్రహ్మకలశ’ ను రిలీజ్ చేశారు.
మొదటి పార్ట్‌కి మ్యూజిక్ ఎంతటి హిట్ అయిందో మనందరికీ తెలుసు. అదే విధంగా ఈసారి కూడా బి. అజనీష్ లోకనాథ్ తన ప్రత్యేక మాయతో ఒక భక్తి గీతాన్ని అందించారు. అబ్బీ వి తన గాత్రంతో ఆ పాటకి మరింత ఆధ్యాత్మికతను జోడించారు. ఆ పాటలోని స్వరాలు, తాళాలు దైవీయంగా మైమరిపించేలా ఉన్నాయి.
ఈ పాటతోనే ప్రీక్వెల్ మ్యూజికల్ డెప్త్ ఎలా ఉంటుందో ఒక క్లూకి ఇచ్చారు. ఇక ఈరోజు హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్కి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ హాజరుకానున్నాడు.