రిషబ్ శెట్టి కాంతారా సినిమా రిలీజ్ ఆయినప్పటినుంచి రోజు ఎదో ఒక వార్త వస్తూనే ఉంది… రిలీజ్ అయినా వెంటనే సినిమా బాగుందని, తరవాత ఫస్ట్ డే కలెక్షన్స్, తరవాత మూడు రోజుల్లోనే 100 కోట్లు కలెక్ట్ చేసిందని, ఇలా ప్రతి వార్త సోషల్ మీడియా లో సెన్సేషన్ లా మారుతుంది.

మొన్నే ఇంగ్లీష్ లో కూడా రిలీజ్ చేస్తున్నారు అన్నారు, నిన్న మేకింగ్ వీడియో వచ్చింది… ఇక ఈరోజు ఏకంగా అప్పుడే OTT లో సినిమా రిలీజ్ అని వార్త వచ్చింది… ఎస్, సినిమా ఇంత పెద్ద హిట్ అయినా కూడా కాంతారా చాప్టర్ వన్ సినిమా ని ఈ అక్టోబర్ 31st న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ చేయబోతున్నారు… ఈ వార్త అమెజాన్ ప్రైమ్ కూడా కంఫర్మ్ చేసి ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేసింది…

ఈ సినిమా థియేట్రికల్ విండో జస్ట్ 29 రోజులు మాత్రమే… చాల తక్కువ కదా… పోనిలే, అక్టోబర్ 31st న ఒక వైపు బాహుబలి, రవి తేజ మాస్ జాతర ఇంకా OTT లో కాంతారా… ఆ రోజు అంతా మంచి సినిమాలే!