బాలీవుడ్‌లో అందాల భామ కత్రినా కైఫ్ గర్భవతి అన్న వార్తలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటివరకు ఆమె గానీ, భర్త విక్కీ కౌశల్ గానీ ఎలాంటి official కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఈ వార్త నిజమా? కేవలం పుకార్లేనా? అని అందరూ ఆలోచిస్తున్న సమయంలో… ఇప్పుడు మాత్రం ఒక నిజం బయటకు వచ్చింది.
బాలీవుడ్ హంగామా ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం కత్రినా ప్రస్తుతం మూడో త్రైమాసికంలో ఉన్నారని కన్ఫర్మ్ అయ్యింది. అంటే ఇంకో నెలలోనే డెలివరీ ఉండనుందని అంటున్నారు. సమాచారం ప్రకారం అక్టోబర్ 15 నుంచి 30 మధ్యలో డెలివరీ జరుగుతుందని చెబుతున్నారు.
ఈ సంతోషకరమైన వార్తను కత్రినా – విక్కీ జంట ఇప్పటివరకు బయటకు చెప్పకపోవడానికి కారణం కూడా ఇదే. బేబీ పుట్టిన తర్వాతే అధికారికంగా ఈ శుభవార్తను పంచుకోవాలని వారు అనుకుంటున్నారట.

ప్రస్తుతం ఈ హ్యాపీ న్యూస్ బాలీవుడ్ మొత్తంలో హాట్ టాపిక్‌గా మారింది. “అందాల రాశి కత్రినా అమ్మ కాబోతుందా?” అనే ఉత్సాహంతో అభిమానులు సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక వచ్చే నెలలో కత్రినా – విక్కీ జీవితాల్లో కొత్త కాంతి వెలుగబోతోంది.