టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం వరుసగా కొత్త కాన్సెప్ట్‌లతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. తాజాగా డెబ్యూ దర్శకుడు జైన్స్ నాని ‘కే-రాంప్’ సినిమా తో మన ముందుకు రానున్నాడు…
ఇటీవలే విడుదలైన టీజర్ ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. మొదటి ఫ్రేమ్ నుంచే టీజర్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేలా ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్‌తో నిండిపోయింది. ఫుల్‌టూ ఫన్, రొమాన్స్, మాస్ యాక్షన్ కలగలిపిన రోలర్‌కోస్టర్ రైడ్‌లా సాగి, పక్కా పాయిసా వసూల్ సినిమాగా మిగిలిపోతుందనే నమ్మకాన్ని కలిగిస్తోంది. పక్క GENZ రొమాంటిక్ లవ్ స్టోరీ అని టీజర్ ఫుల్ CLARITY ఇచ్చేసింది…
ప్రత్యేకంగా కిరణ్ అబ్బవరం కామెడీ టైమింగ్, ఎనర్జిటిక్ స్క్రీన్ ప్రెజెన్స్ ఈ టీజర్‌కి హైలైట్‌గా నిలిచాయి. ఆయన సరదా డైలాగులు, శక్తివంతమైన బాడీ లాంగ్వేజ్ అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచేశాయి.
దర్శకుడు జైన్స్ నాని తన మొదటి సినిమాకే పంచ్‌తో కూడిన దర్శకత్వాన్ని చూపించగా, చైతన్ భరద్వాజ్ అందిస్తున్న సంగీతం, సతీష్ రెడ్డి సినిమాటోగ్రఫీ, చిన్నకె ప్రసాద్ ఎడిటింగ్‌తో ఈ చిత్రం మరింత ఆకర్షణీయంగా రూపుదిద్దుకుంటోంది.
అక్టోబర్ 18న దీపావళి కానుకగా ‘కే-రాంప్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. మేకర్స్ ఇంకా మరిన్ని అప్‌డేట్స్ త్వరలోనే తెలియజేయనున్నారు.