రాక్షసుడు తర్వాత మళ్లీ బెల్లంకొండ సాయి శ్రీనివాస్–అనుపమ పరమేశ్వరన్ జంటగా తెరపైకి వచ్చిన సినిమా కిష్కింధపురి. ఇది శ్రీనివాస్ కెరీర్‌లో తొలిసారి చేసిన హారర్ జానర్ సినిమా. టీజర్లు, ట్రైలర్లు చూసినప్పటి నుంచే ప్రేక్షకుల్లో ఒక రకమైన ఆసక్తి కలిగించిన ఈ చిత్రం ఈరోజే థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది… సో, మరి రివ్యూ తెలుసుకుందామా:
కథలోకి డైరెక్ట్ గా వెళ్తే… రాఘవ్, మైతిలి ప్రేమికులుగా పరిచయం అయ్యారు. వీళ్ళతో పాటు సుదర్శన్ ఉంటాడు… వేళ్ళ ముగ్గురు ఘోస్ట్ వాకింగ్ పేరుతో హాంటెడ్ హౌసెస్ టూర్స్ నిర్వహిస్తుంటారు. థ్రిల్ కోరుకునే యువతని పాడుబడిన బంగ్లాలు, గృహాలకి తీసుకెళ్లి, అక్కడ నిజంగానే దెయ్యాలు ఉన్నాయన్న భ్రమ కలిగించడం వాళ్ళ పని.
అలాంటి ఓ ట్రిప్‌లో 11 మందిని వెంటబెట్టుకొని 1989లో మూసివేయబడిన సువర్ణమాయ అనే రేడియో స్టేషన్‌కి చేరుకుంటారు. అక్కడే మొదలవుతుంది భయానక గాథ. రేడియో నుంచి వినిపించే వేదవతి వాయిస్ ఒక్కసారిగా గందరగోళం రేపుతుంది. “ఇక్కడికి అడుగుపెట్టిన వారెవరూ బ్రతకరని” ఇచ్చిన హెచ్చరిక కాసేపటిలోనే నిజమవుతుంది. బృందంలో ముగ్గురు ఒక్కసారిగా ప్రాణాలు కోల్పోతారు. ఆ తర్వాత ఆ దెయ్యం కన్నెముద్ద చిన్నారిని లక్ష్యంగా చేసుకుంటుంది. అప్పుడు రాఘవ్ తన ప్రాణాల్ని పణంగా పెట్టి దానితో ఎదురెళ్లాల్సి వస్తుంది. మిగతా వాళ్ల పరిస్థితి ఏమైందీ? వేదవతి ఎవరు? ఆమెకు ఈ సువర్ణమాయ స్టేషన్‌తో ఉన్న రహస్య బంధం ఏమిటి? ఈ ప్రశ్నల చుట్టూ కథ సాగేలా చిత్రాన్ని నడిపించాడు దర్శకుడు.
నటీనటుల విషయానికి వస్తే – బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హారర్ జానర్‌లో కొత్తగా కనిపించాడు. యాక్షన్ సన్నివేశాల్లో తన స్టైల్ చూపిస్తూ, భయానక సన్నివేశాల్లో కూడా నమ్మించే నటన కనబరిచాడు. అనుపమ అందంగా కనిపించడమే కాకుండా, ద్వితీయార్థంలో దెయ్యంలా భయపెట్టేలా తన పాత్రని ప్రాణం పెట్టింది. ఆమె దెయ్యంగా మారే ఎపిసోడ్ ప్రత్యేకంగా నిలుస్తుంది. విశ్రవపుత్రుడిగా శాండీ మాస్టర్ ఆశ్చర్యపరిచే నటన కనబరిచాడు. హైపర్ ఆది, సుదర్శన్ మొదట్లో హాస్యం పండించేందుకు ప్రయత్నించినా పెద్దగా ఆకట్టుకోలేదు.
Positive Elements విషయానికి వస్తే:
భయపెట్టే సన్నివేశాలు
శ్రీనివాస్–అనుపమ జంట
సో, ఫైనల్ గా ఈ సినిమా ఒకసారి కచ్చితంగా థియేటర్ లో చూడచ్చు… మా రేటింగ్: 3/5