సుకుమార్… ఈ దర్శకుడి గురించి పరిచయాలు అక్కరలేదు… పుష్ప సినిమా చుస్తే చాలదు, ఎంత టాలెంటెడ్ ఓ చెప్పడానికి… ఐతే సుకుమార్ కేవలం దర్శకుడి గా కాదు రచయత గా కూడా బాగా ఫేమస్! మంచి కథలు అందిస్తాడు! అందుకే తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన కథలతో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న దర్శకుడు సుకుమార్. కొత్త తరహా కథనం ఆయన ప్రత్యేకత. అలానే తన అసిస్టెంట్ డైరెక్టర్లను ప్రోత్సహిస్తూ, కొత్త ప్రతిభను వెలుగులోకి తీసుకురావడంలో కూడా ముందుంటారు.
అతని సహాయ దర్శకులలో బుచ్చి బాబు సనా, శ్రీకాంత్ ఒడెల, సూర్య ప్రతాప్, కార్తిక్ దండు వంటి వారు ఇప్పుడు మంచి దర్శకులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. కొత్త దర్శకుల కోసం సుకుమార్ “సుకుమార్ రైటింగ్స్” అనే నిర్మాణ సంస్థను స్టార్ట్ చేసాడు.

ఈ బ్యానర్ నుంచి వచ్చిన తొలి సినిమా కుమారి 21F (2015), దర్శకుడు పళ్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో రూపొందింది. అప్పట్లోనే ఆ సినిమా bold కాన్సెప్ట్ తో యువతను ఆకట్టుకుంది. తర్వాత ఉప్పెన, వీరూపాక్ష వంటి సినిమాలను కూడా సుకుమార్ రైటింగ్స్ నిర్మించింది — ఇవి రెండూ భారీ విజయాలు సాధించాయి.
ఇప్పుడు అదే బ్యానర్ నుంచి ‘కుమారి 22F ‘ రాబోతోంది. ఇది కుమారి 21Fకు స్పిరిచువల్ సీక్వెల్‌గా తెరకెక్కబోతోందని సమాచారం. ఈ సినిమాకి దర్శకత్వం వహించేది సుకుమార్ అసోసియేట్లలో ఒకరు.
ఈ సినిమా ప్రత్యేకత ఏమిటంటే — దీన్ని సుకుమార్ రైటింగ్స్ తో పాటు సుకుమార్ భార్య థబిత సుకుమార్ ప్రారంభించిన కొత్త నిర్మాణ సంస్థ ‘థబిత సుకుమార్ ఫిలిమ్స్’ కలిసి నిర్మించబోతున్నాయి. థబిత సుకుమార్ ఇటీవల ‘మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం’ సినిమాను ప్రెజెంట్ చేశారు. ఇప్పుడు పూర్తి స్థాయి నిర్మాతగా కుమారి 22Fతో నిర్మాత గా మారబోతున్నారు.
 
			 
			 
			