చాలా కాలం తర్వాత తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లు మళ్ళీ హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం—పెద్ద సినిమాలు నిరాశ పరచిన సమయంలో చిన్న సినిమాలు ముందుకు వచ్చి ప్రేక్షకులకు కావాల్సిన కంటెంట్ అందించడం. దాదాపు నెలరోజులుగా థియేటర్లకు ఒక స్థిరమైన ఆదాయం వస్తోంది. లిటిల్ హార్ట్స్, కిష్కిందాపురి, మిరాయి… ఈ మూడు సినిమాలు ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతూ హడావుడి చేస్తున్నాయి.

లిటిల్ హార్ట్స్‌లో మౌలి, శివాని లీడ్ రోల్స్‌లో నటించారు. రిలీజ్ అయ్యినప్పటి నుంచి కలల రన్‌ను ఆస్వాదిస్తున్న ఈ సినిమా, కొత్తగా వచ్చిన సినిమాలు ఉన్నప్పటికీ ఓ వర్గం ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. ఇప్పటికే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు లాభాల బాట పట్టారు. ఈ సినిమా కేవెలం రెండున్నర కోట్ల తో తెరకెక్కిన కానీ ముప్పై కోట్ల పైగా వసూళ్లు సాధించింది…
ఇక గత శుక్రవారం థియేటర్లలోకి అడుగుపెట్టిన కిష్కిందపురి, మిరాయి రెండు సినిమాలు కూడా బలమైన ఓపెనింగ్స్ సాధించాయి. వీటిలో మిరాయి ముందంజలో ఉంది. అయితే కిష్కిందాపురి కూడా స్థిరంగా పుంజుకుంటూ రెండో రోజు వసూళ్లు మొదటి రోజు కంటే మెరుగ్గా ఉన్నాయి.

బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన కిష్కిందపురి, హారర్ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కథను జానర్‌కి నిజంగా న్యాయం చేసేలా తెరకెక్కించారనే అభిప్రాయం వస్తోంది. అందుకే ఈ తరహా సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులు పెద్ద ఎత్తున థియేటర్లకు వస్తున్నారు. ఈ సినిమా కూడా తక్కువ బడ్జెట్ తోనే తీశారు. కానీ అనుకున్న దానికంటే డబల్ కలెక్షన్స్ రాబట్టుతుందని అందరు అంటున్నారు.

అయితే వీకెండ్ విన్నర్ విషయానికి వస్తే—అది నిస్సందేహంగా తేజ సజ్జా మిరాయి దే. యూనానిమస్ పాజిటివ్ టాక్‌తో ఈ సినిమా బుకింగ్స్ అన్ని ఏరియాల్లోనూ భారీగా జరుగుతున్నాయి. ప్రేక్షకులకు ఇస్తున్న అనుభూతి అసలు థియేట్రికల్ ఫీస్ట్‌లా ఉందని చెప్పుకోవాలి.
సమ్మర్ సీజన్, వర్షాకాలం రెండూ పెద్దగా సినిమాటిక్ సక్సెస్‌లు ఇవ్వకపోవడంతో నిరాశ నెలకొంది. అయితే సెప్టెంబర్ మాత్రం మళ్ళీ థియేటర్లలో వెలుగులు నింపుతోంది.
ఈ మోమెంటమ్ అలాగే కొనసాగాలి. ఎందుకంటే సెప్టెంబర్ లోనే కదా మన పవన్ కళ్యాణ్ OG హంగామా షురూ అయ్యేది… ఈ సినిమా 25th న రిలీజ్ కి రెడీ గా ఉంది. ఈ సినిమా కూడా అదిరిపోతే, ఈ సెప్టెంబర్ ని అందరు బాగా గుర్తుంచుకుంటారు. ఇక పండగ సీసన్ కి కూడా మంచి బూస్ట్ వస్తుంది!