Native Async

లోకేష్ కానగరాజ్ హీరో గా తీసుకున్న పారితోషికం ఎంతో తెలుసా???

Lokesh Kanagaraj’s Acting Debut in ‘DC’ Movie – Director Turns Hero with a ₹35 Crore Paycheck!
Spread the love

కోలీవుడ్ పాపులర్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ సినిమాల గురించి ప్రత్యేకంగా ఏమి చెప్పకర్లేదు అనుకుంట??? కానీ ఇప్పుడు అతను హీరోగా మారబోతున్నారు. ఆ సినిమా పేరు పేరు DC. ఈ సినిమాను ప్రతిభావంతుడైన దర్శకుడు అరు‍ణ్ మాథేస్వరన్ తెరకెక్కిస్తుండగా, భారీ స్థాయిలో సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక పెద్ద రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే, లోకేష్ ఈ సినిమాలో నటించడం మాత్రమే కాకుండా, స్క్రిప్ట్ పనుల్లోనూ భాగస్వామ్యం చేసారని, అందుకే ఆయనకు రూ.35 కోట్ల భారీ పారితోషికం అందుతుందట!

కూలీ సినిమా ప్రమోషన్స్ టైం లో లోకేష్ స్వయంగా ఆ సినిమా కి రూ.50 కోట్ల పారితోషికం తీసుకున్నానని చెప్పిన విషయం గుర్తొస్తోంది. అదే కారణంగా ఇప్పుడు ఈ DC సినిమాకు సంబంధించిన రూమర్స్ మరింత బలంగా వినిపిస్తున్నాయి. మొత్తానికి, లోకేష్ కనగరాజ్ పారితోషికం చుట్టూ DC సినిమా పేరు తమిళ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు లోకేష్ గానీ, సినిమా టీమ్ గానీ అధికారికంగా స్పందించలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🔔 Subscribe for Latest Articles
Share: FacebookX/TwitterTelegramWhatsAppLinkedInReddit