ప్రశాంత్ వర్మ సినిమాలు అంటే ఎదో ప్రత్యేకత ఉంటుంది అని మనకు తెలిసిందే… ఆల్రెడీ మనం హను-మాన్ వంటి బ్లాక్బస్టర్ చూసాం. ఇప్పుడు మరి ప్రశాంత్ వర్మ యూనివర్స్ నుంచి నెక్స్ట్ సినిమా రావడానికి వేళయింది… అదే ‘మహాకాళి’… ఈ సినిమా ని ప్రశాంత్ డైరెక్ట్ చేయకపోయినా, మిగితాదంతా అయన పర్యవేక్షణలోనే నడించింది…
ఈ సినిమా కి దర్శకురాలిగా పూజా అపర్ణ కొల్లూరు పరిచయం అవుతున్నారు. అలాగే చిత్రాన్ని RK దుగ్గల్ సమర్పిస్తున్నారు.
ఇక ఈరోజు ఈ సినిమా లో బాలీవుడ్ స్టార్ అక్షయ్ ఖన్నా ని శుక్రాచార్య గా పరిచయం చేస్తూ, ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు…
అక్షయ్ ఖన్నా ఆల్రెడీ విక్కీ కౌశల్ నటించిన ‘ఛావా’ సినిమా లో ఔరంగాజీబ్ పాత్ర లో నటించి మెప్పించాడు, భయపెట్టాడు మరి… శంభాజీ మహారాజ్ ని చంపుతూ ఆ రాక్షస ఆనందం అంతా తన కళ్ళల్లో చూపించాడు. అందుకే ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో కూడా అంతే క్రూరంగా, ఒక కంటి వెలుగు తో చంపేశాడు అని చెప్పచ్చు.
హిందూ ఇతిహాసాల్లో అత్యంత క్లిష్టమైన పాత్రల్లో ఒకటైన శుక్రాచార్యుడి రూపంలో అక్షయ్ ఖన్నా నటించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ముఖ్యంగా ‘ఛావా’ విజయంతో ఆయనకు అనేక ఆఫర్లు వచ్చినా, ‘మహాకాళి’ లోని ఈ పాత్ర చూసి ఆకట్టుకున్న అక్షయ్, తెలుగు డెబ్యూట్ గా దీనినే ఎంచుకున్నారు.
టెక్నికల్ టీం విషయానికి వస్తే, సంగీతం సమరన్ సాయి అందిస్తుండగా, సినిమాటోగ్రఫీ సురేష్ రఘుటు చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ వేగంగా సాగుతుండగా, డిసెంబర్ లోపల మిగతా పనులు పూర్తి కానున్నాయి.