“ఓం నమో భగవతే వాసుదేవాయ…” అంటూ మనం సినిమా చూస్తున్నంత సేపు పాడుకుంటూ, ఆ స్వామి ని తలచుకున్నాం కాదు. అసలు సినిమా మొత్తం యానిమేషన్ అయినా కానీ, అలా ఫీల్ అవ్వలేదు. ఆ నారాయణుడి నరసింహ అవతారం కోసం ప్రహ్లాదుడు ఎలా వెయిట్ చేసాడో, మనం కూడా అలానే వెయిట్ చేసాం.
ఈ కాలం పిల్లలకి కూడా ఈ సినిమా తెగ నచ్చేసింది… అమ్మ నరసింహ అవతారం ఎలా వచ్చింది? ఆ దేవుడు ప్రహ్లాదుడి కి ఎలా హెల్ప్ చేసాడు? అన్న ప్రశ్నలు చాల మంది పిల్లలు వాళ్ల అమ్మ నాన్నల్ని అడిగారు కదా.
అంతలా మైమరిపించింది ఈ సినిమా మరి… అందుకే ఈ సినిమా మళ్ళి OTT లో ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నాం… ఇంకా వెయిట్ చేయక్కర్లేదు… రేపే ఈ సినిమా Netflix లో స్ట్రీమ్ అవ్వబోతోంది.

నిర్మాతలు కూడా ఈ న్యూస్ ని confirm చేస్తూ ఒక ఆఫీసియల్ పోస్టర్ రిలీజ్ చేసారు…
ఇక సినిమా స్టోరీ విషయానికి వస్తే, అతి భయంకరమైన రాక్షసులు హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడిని విష్ణు మూర్తి, వరాహ, నరసింహ అవతారాలు దాల్చి ఎలా సంహరించాడో చాల చక్కగా చూపించారు.


HOMBALE CINEMAS బ్యానర్ వాళ్ళు నిర్మించిన ఈ సినిమా ఈ సిరీస్ లో ఫస్ట్ సినిమానే… ఇంకా:
– Mahavatar Parshuram (2027)
– Mahavatar Raghunandan (2029)
– Mahavatar Dwarkadhish (2031)
– Mahavatar Gokulananda (2033)
– Mahavatar Kalki Part 1 (2035)
– Mahavatar Kalki Part 2 (2037)
సినిమాలు లైన్ లో ఉన్నాయ్… ఇప్పటికైతే మహావతార్ నరసింహ సినిమా ని మళ్ళి OTT లో చూసేద్దాం!