మన హిందూ సంప్రదాయం లో ఆడపిల్లలు పూలు పెట్టుకుంటే ఎంత పద్దతిగా ఉంటుందో తెలిసిందే కదా… ఈ పండగ వచ్చినా, పేరంటానికి వెళ్లినా లేకపోతె పెళ్లి రోజైన, పుట్టిన రోజైన, పూలు పెట్టుకుంటే, ఆడపిల్ల నిండు గా ఉంటుంది అని అనుకుంటాం… ఇక కేరళ లో ఐతే అదికూడా ఓనం పండగ రోజున పూలు పెట్టుకోవడం వాళ్ళ ఆచారం కూడా!
ఐతే ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకంటే, ఒక మలయాళీ హీరోయిన్ Navya Nair ఎయిర్ పోర్ట్ లో పూలు పెట్టుకునేందుకు ఏకంగా Rs 1.14 lakhs ఫైన్ వేసారంట.
అసలు కథ ఏంటంటే, నవ్య కేరళ పండగ ఓనం సందర్బంగా ఆస్ట్రేలియా లో Malayali Association of Victoria వాళ్ళు ఏర్పాటు చేసిన ప్రోగ్రాం కి వెళ్ళేటప్పుడు ఎయిర్ పోర్ట్ లో ఈ సంఘటన జరిగింది. ఎయిర్ పోర్ట్ లో నవ్య వాళ్ళ నాన్న ఇచ్చిన పూలు పెట్టుకుంది కానీ అది ఆస్ట్రేలియా కస్టమ్స్ రూల్స్ కి వ్యతిరేకం. సో, తనకి తెలియకుండానే ఈ తప్పు జరిగిందని ఒప్పుకుని ఒక స్టేట్మెంట్ కూడా విడుదల చేసింది నవ్య…
“నేను చేసిన పని చట్టానికి విరుద్ధం. అది నేను తెలియక చేసిన తప్పు. కానీ తెలియక చేసినా తప్పు తప్పే. కేవలం 15 సెంటీమీటర్ల మల్లెపూవుల దండ తీసుకెళ్లినందుకు అధికారులు 28 రోజుల్లోగా AUD 1,980 ఫైన్ వేయమని చెప్పారు. తప్పు అనేది తప్పే.. అది ఉద్దేశపూర్వకంగా చేసినా, తెలియక చేసినా.”
నవ్య కి Melbourne International Airport కస్టమ్స్ అధికారులు 15 cm మల్లె పూలు పెట్టుకున్నందుకు ఏకంగా Rs 1.14 lakhs ఫైన్ వేశారు. ఆస్ట్రేలియా లో కస్టమ్స్ రూల్స్ అంత స్ట్రిక్ట్ గా ఉంటాయి మరి…