అనిల్ రావిపూడి సినిమాలంటే మొత్తం ఎంత ప్రమోషన్స్ ఉంటాయో మన అందరికి తెలిసిందే… సంక్రాంతికి వస్తున్నాం సినిమా తో అసలు ప్రమోషన్స్ అంటే ఇలా చేయాలి అనే రేంజ్ లో దూసుకుపోయాడు ఈ డైరెక్టర్. వెంకటేష్ తో పాట పాడించాడు. పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల తో సాంగ్ పాడించాడు… ఇంకా చాల చాల చేశాడు… ఆఖరికి సినిమా బ్లాక్బస్టర్ అయ్యింది కూడా.
ఇక ఇప్పుడు సినిమా చేస్తున్నది ఏకంగా మెగాస్టార్ చిరంజీవి తో… హీరోయిన్ నయనతార… వెంకటేష్ కూడా మంచి రోల్ చేస్తున్నాడు. సో, ఇన్ని ప్రత్యేకతలు ఉన్న సినిమా ని వదులుతాడా??? పైగా సినిమా సంక్రాంతి కి రిలీజ్. సో, ప్రమోషన్స్ మొదలు పెట్టేసాడు. ఫస్ట్ సాంగ్ “మీసాల పిల్ల…” ఉదిత్ నారాయణ్ తో పాడించాడు. నయన్ చిరు ని డాన్స్ చేయించి సూపర్ అనిపించాడు.
ఇక ఇప్పుడు సెకండ్ సాంగ్, “శశిరేఖ…” టైం… ఈ సాంగ్ ని 8th న రిలీజ్ చేస్తారంట… ఇంకా ఈ అనంత్ శ్రీరామ్ రాసిన పాట, పడింది మన మధు ప్రియా… సో, మంచి సాంగ్ రాబోతోంది మరి!
ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజెస్తు, హైప్ ని పెంచేసాడు అనిల్ రావిపూడి! ఇక సాంగ్ పోస్టర్ లో చిరు ఎర్రటి పూల షర్ట్ లో మెరిసిపోయాడు… స్టైల్ గా ఉన్నాడు!