మంచు మనోజ్… ఎంత వారసుడైన కానీ, జూనియర్ NTR కి వచ్చిన హైప్ స్టార్టింగ్ లో మనోజ్ కి కూడా వచ్చింది… స్క్రీన్ ప్రెసెన్స్, హొమౌర్ అన్ని కలిపి మంచి హీరో గా elevate అయ్యాడు. కానీ మధ్యలో తన పర్సనల్ లైఫ్ లో గ్యాప్ వల్ల సినిమాలకి దూరం అయ్యాడు… కానీ ఇప్పుడు మళ్ళి బౌన్స్ బ్యాక్ అయ్యి సూపర్ అనిపిస్తున్నాడు!
మొన్నే భైరవం లో విలన్ గా, మిరాయి లో విలన్ గా చేసి చింపేసాడు… ఇప్పుడు హీరో గా సినిమా చేసేందుకు వేళయింది! డేవిడ్ రెడ్డి సినిమా తో త్వరలో మన ముందుకు రాబోతున్నాడు!
ఇందాకే ఈ సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్ ని రిలీజ్ చేసి, సాయంత్రం AAA మాల్ లో ఈ సినిమా ‘WAR DOG ‘ పోస్టర్ ని రిలీజ్ చేస్తారని అనౌన్స్ చేసారు మేకర్స్… ప్రీ-లుక్ పోస్టర్ లో అసలు చింపేసాడు… బైక్ పై స్టైలిష్ గా కనిపించిన డేవిడ్ రెడ్డి ని చుస్తే సూపర్ అనిపించింది! ఆ బైక్ కూడా భలే స్టైలిష్ గా ఉంది!