టాలీవుడ్ రాకింగ్ స్టార్ మంచు మనోజ్ తన కెరీర్లో మంచి కం బ్యాక్ ఇచ్చి ఇప్పుడు ఫుల్ సినిమాలతో బిజీ గా ఉన్నాడు. ఆల్రెడీ మిరాయి లో బ్లాక్ స్వోర్డ్ గా అందరిని మెప్పించాడు! ఇప్పుడు మరో శక్తివంతమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
మనోజ్ నెక్స్ట్ ‘డేవిడ్ రెడ్డి’ గా కనిపించబోతున్నాడు. హనుమ రెడ్డి యక్కంటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చారిత్రక యాక్షన్ డ్రామా, 1897 నుంచి 1922 మధ్య కాలంలో భారత స్వాతంత్ర్య పోరాటం నేపథ్యంగా తెరకెక్కుతోంది. ఈ రోజు గ్రాండ్ లాంచ్ ఈవెంట్లో మేకర్స్ సినిమా నుంచి ఒక ప్రత్యేకమైన గ్లింప్స్‌ను విడుదల చేశారు.
‘స్పీడ్ ఆఫ్ డేవిడ్ రెడ్డి’ అనే టైటిల్‌తో వచ్చిన ఈ గ్లింప్స్, మొదటి ఫ్రేమ్ నుంచే తిరుగుబాటు భావాన్ని బలంగా ప్రతిబింబిస్తుంది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ఒక అగ్ని పర్వతంలాంటి పాత్రను ఈ సినిమా ప్రేక్షకులకు పరిచయం చేస్తోంది.
ఈ చిత్రంలో మంచు మనోజ్ డేవిడ్ రెడ్డి అనే పాత్రలో ఇప్పటివరకు ఎప్పుడూ చూడని కొత్త అవతార్‌లో కనిపించనున్నారు. ఆయన నటనలో నిజాయితీ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ పీరియడ్ ఎపిక్‌లో మనోజ్ ఫైర్, ఫ్యూరీ రెండింటినీ ఒకేసారి తెరపై చూపించబోతున్నట్టు గ్లింప్స్ చెబుతోంది.
స్పీడ్ ఆఫ్ డేవిడ్ రెడ్డి గ్లింప్స్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ‘వార్ డాగ్’ అనే బైక్. ఆ బైక్‌కు ఉన్న చరిత్ర, దాని వెనుక ఉన్న భావోద్వేగాన్ని సెన్సేషనల్ ఎలివేషన్‌తో చూపించారు. ప్రతి షాట్‌లోనూ హీరో పాత్రకు ఒక ప్రత్యేకమైన స్టైల్, పవర్ కనిపిస్తుంది.
ఈ గ్లింప్స్‌లో ఒక తండ్రి తన కుమారుడికి ఒక తిరుగుబాటు వీరుడి కథను చెబుతాడు. భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్‌లా బ్రిటిష్లకు ఎదురొడ్డి పోరాడిన వాడు అయినప్పటికీ, తన దేశంలోనే అపార్థం చేసుకోబడిన ఒక యోధుడిగా డేవిడ్ రెడ్డి కథను పరిచయం చేస్తారు.
విజువల్స్ పరంగా గ్లింప్స్ చాలా స్టన్నింగ్‌గా ఉంది. రఫ్ అండ్ గ్రిటీ టోన్ సినిమాకు బలమైన ఇంపాక్ట్ ఇస్తోంది. ముఖ్యంగా మంచు మనోజ్ చేసిన ట్రాన్స్ఫర్మేషన్ అద్భుతంగా ఉంది. ఆయన గ్రాండ్ లుక్, బాడీ లాంగ్వేజ్, స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకుల దృష్టిని వెంటనే ఆకర్షిస్తాయి.