తెలుగు సినిమాల్లో గుంటూరు కారం, లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం, హిట్ 2 వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న మీనాక్షి చౌదరి ఇప్పుడు బాలీవుడ్ వైపు అడుగుపెడుతున్నారు. అలాగే తమిళంలో GOAT చిత్రంలో తలపతి విజయ్ సరసన నటించారు.
ఇప్పుడు మీనాక్షి చౌదరి, బాలీవుడ్ లో పాపులర్ యాక్షన్ ఫ్రాంచైజీ ఫోర్స్ మూడో భాగం ఫోర్స్ 3 లో హీరోయిన్ గా ఎంపిక అయ్యారు. ఈ సినిమాలో జాన్ అబ్రహామ్ హీరోగా నటిస్తుండగా, భవ ధూలియా దర్శకత్వం వహిస్తున్నారు.

రిపోర్ట్స్ ప్రకారం, అనేక మంది హీరోయిన్స్ ని పరిశీలించిన తర్వాత చివరికి జాన్ అబ్రహామ్, డైరెక్టర్ భవ ధూలియా ఇద్దరూ కలిసి మీనాక్షిని ఈ సినిమాలో లీడ్ రోల్ కోసం ఫైనల్ చేశారు. ఇందులో ఆమె యాక్షన్ ఓరియెంటెడ్ క్యారెక్టర్ చేస్తారని, దానికోసం ప్రత్యేకమైన శిక్షణ కూడా తీసుకుంటారని సమాచారం. ఆల్రెడీ మనం మీనాక్షి ని పోలీస్ ఆఫీసర్ గా సంక్రాంతికి వస్తున్నాం సినిమా లో చూసాం కదా! సో, ఆ యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాస్ కి తాను పర్ఫెక్ట్ గా సరిపోతుంది.
ఈ సినిమా షూటింగ్ నవంబర్ నుంచి ప్రారంభమవుతుందని, 2026 మొదటి అర్ధభాగంలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా, మీనాక్షి ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి సరసన నటిస్తున్న అనగనగా ఒక రాజు సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆ చిత్రం సంక్రాంతి 2026 సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.