‘దే కాల్ హిమ్ OG’ గురువారం విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. పాజిటివ్ టాక్ తో థియేటర్లు కిక్కిరిసిపోతుండగా, అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో ఆనందం పంచుకున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా వచ్చిందంటే ఎప్పటిలానే మెగా ఫ్యామిలీ ఎలా స్పందిస్తుందా అన్న ఆసక్తి అందరిలో కనిపించింది. కానీ పవన్ కళ్యాణ్ జ్వరం కారణంగా సినిమా సెలెబ్రేషన్స్ లో పాల్గొనలేక పోయారు…
కానీ ఇప్పుడు హమ్మయ్య… పవన్ కళ్యాణ్ కి జ్వరం తగ్గిపోయింది… సినిమా రిలీజ్ అయ్యి 4 రోజులు ఐన తరువాత పవన్ కళ్యాణ్ తన ఫామిలీ తో కలిసి సినిమా చూసాడు… సోమవారం సాయంత్రం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో అన్నయ చిరు, రామ్ చరణ్, పిల్లలు ఆధ్య అకిరా. సాయి ధర్‌మ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ తో పాటు ఇతర మెగా కుటుంబ సభ్యులు తో కలిసి సినిమా చూసాడు మన పవర్ స్టార్… ఇప్పుడు సోషల్ మీడియా అంత అవే వీడియోస్ వైరల్ అవుతున్నాయి.

సినిమా చూసాక మన మెగాస్టార్ ట్విట్టర్ లో రివ్యూ కూడా పోస్ట్ చేసారు…
“Watched #TheyCallHimOG with my whole family and thoroughly enjoyed every bit of it. A brilliantly made underworld gangster film on par with Hollywood standards, while keeping the right emotions intact. From beginning to end, the director conceived the film in an extraordinary way, Congratulations to
@sujeethsign. Felt so proud watching Kalyan Babu on screen. He made the film stand out with his swag and gave the fans the proper feast they’ve been waiting for. @MusicThaman poured his heart and soul into the music, @dop007 delivered excellent visuals, and the editing & artwork were super. Every single member of the team gave their all and delivered the best. Congratulations to Producer Danayya and the whole team.”
ఈ ట్వీట్ చూసాక తెలుస్తుంది… పవన్ కళ్యాణ్ మెగాస్టార్ మధ్య ఎంతగా ప్రేమ ఉందొ అని…
అలాగే డైరెక్టర్ సుజీత్ పోస్ట్ కి రిప్లై ఇస్తూ మెగా ఫామిలీ పై తన ప్రేమ ని వ్యక్తపరచాడు…
ఇప్పటికే OG సినిమా 250 కోట్ల కలెక్షన్ మార్క్ దాటేసింది…