మెగాస్టార్ చిరంజీవి ఇంకా హిట్ మెషిన్ అనిల్ రవిపూడి తొలిసారి కలిసి చేస్తున్న పక్కా ఎంటర్‌టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’. ఇప్పటికే ఈ సినిమా దేశవ్యాప్తంగా భారీ బజ్‌ను క్రియేట్ చేస్తోంది. ఆల్రెడీ విడుదలైన ‘మీసాల పిల్ల’, ‘శశిరేఖ’ పాటలు చార్ట్‌బస్టర్స్‌గా నిలవడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలోనే ఈరోజు ‘మెగా విక్టరీ మాస్’ సాంగ్‌ను రిలీజ్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ రవిపూడి విజయవాడ దుర్గమ్మ ఆలయాన్ని సందర్శించి మీడియాతో మాట్లాడారు. ఇటీవల ది రాజా సాబ్ ఈవెంట్‌లో ప్రభాస్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. “మేమంతా సీనియర్స్ దగ్గరే నేర్చుకున్నాం. సంక్రాంతికి విడుదలయ్యే ప్రతి సినిమాను, మా సినిమాను కూడా చూడండి” అంటూ ప్రభాస్ చేసిన వ్యాఖ్యకు అనిల్ రవిపూడి కృతజ్ఞతలు తెలిపారు.
అనిల్ రవిపూడి మాట్లాడుతూ,
“అందుకే ఆయనను ‘డార్లింగ్’ అంటారు. అంత పెద్ద స్టార్ అయినప్పటికీ, సీనియర్స్‌పై అంత గౌరవంతో మాట్లాడటం ఆయన గొప్ప మనసును చూపిస్తుంది. ఆయన మాటల్లో ఉన్న నిజాయితీ, ప్రేమ, గౌరవం మమ్మల్ని చాలా ఇంప్రెస్ చేశాయి. ఇంత మంచి స్టేట్‌మెంట్ ఇచ్చిన ప్రభాస్‌కి నా హ్యాట్స్ ఆఫ్. త్వరలోనే ఓ పెద్ద వేదికపై ఆయనకు వ్యక్తిగతంగా ధన్యవాదాలు చెబుతాను” అని అన్నారు.
ఇక ‘మెగా విక్టరీ’ సాంగ్ థియేటర్లలో తెలుగు ప్రేక్షకులకు పక్కా మాస్ బ్లాస్ట్ అవుతుందని అనిల్ రవిపూడి కన్ఫర్మ్ చేశారు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ఎక్స్‌టెండెడ్ క్యామియోలో కనిపించనుండగా, చిరంజీవితో ఆయన తొలిసారి స్క్రీన్ షేర్ చేయడం ఈ సినిమాకి మరో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా జనవరి 12న థియేటర్లలో విడుదల కానుంది.