ఈ రెండు సినిమాలు మనన్ని ఎంతగా అలరించాయి తెలుసు కదా… ఈ వారము ఎలాగో పవన్ కళ్యాణ్ OG సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి, ఆ సినిమా కి హిట్ టాక్ వస్తే, చాల మటుకు కలెక్షన్స్ తగ్గచ్చు. అందుకే ఈ రెండు రోజులు ఇంకా థియేటర్స్ లో బాగా రన్ అవుతాయి అనమాట.
ప్రస్తుతానికి మరి ఈ రెండు సినిమా కలెక్షన్ రిపోర్ట్స్ చూద్దామా:
తేజ సజ్జ మిరాయి ఐతే సూపర్ గా దూసుకుపోతోంది… ప్రస్తుతానికి 134 కోట్లు కలెక్షన్ సొంతం చేసుకుంది. తేజ సజ్జ కూడా ఈ పెద్ద న్యూస్ తన ట్విట్టర్ లో షేర్ చేసి, సినిమా లవర్స్ ని ఖుష్ చేసాడు…
ఈ సినిమా స్టోరీ మనందరికీ తెలిసిందే కదా అశోకుడు రాసిన అమరత్వం రహస్య గ్రంధాలూ కాపాడడం కోసమే మిరై చేతబట్టి, బ్లాక్ స్వోర్డ్ కి ఎదురు నిలుస్తాడు మన తేజ. అలా రాముని బాణం తో బ్లాక్ స్వోర్డ్ ని చంపి, తన తల్లి త్యాగానికి ఫలితాన్ని ఇస్తాడు.
ఇక కిష్కింధపూరి సినిమా విషయానికి వస్తే, మిరాయి ఇంకా లిటిల్ హార్ట్స్ సినిమా పోటీ వల్ల అంతగా కలెక్షన్స్ రాలేదు కానీ హిట్ ఐంది… ప్రస్తుతానికి 27 కోట్లు కలెక్ట్ చేసింది ఈ సినిమా…
ఇంకా రెండు రోజుల్లో OG సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి, అప్పటి వరకు ఇంకా కలెక్షన్స్ పెరిగే ఛాన్స్ ఉంది!