మిరాయి… ఇప్పుడు ఎక్కడ చుసిన ఈ సినిమా గురించే చర్చ. పోనీ టాలీవుడ్ ఒక్కదానిలో ఐతే పరవాలేదు. కానీ బాలీవుడ్ లో కూడా ఈ సినిమా ని అందరు పొగిడేస్తున్నారు. అసలు హిందీ లో ఐతే సినిమా సూపర్ గా ఉందని అంటున్నారు. ఐతే ఈ సినిమా లాస్ట్ ఫ్రైడే రిలీజ్ ఐన సంగతి తెలిసిందే కదా… అందుకే మూడు రోజుల్లోనే ఏకంగా తొంబై కోట్ల కలెక్షన్స్ దాటేసింది… మాక్సిమం ఈరోజు 100 కోట్ల కలెక్షన్స్ దాటొచ్చు.
అందుకే సినిమా టీం కూడా తమ ఆనందాన్ని ట్విట్టర్ లో షేర్ చేస్కుంటూ, కలెక్షన్స్ పోస్టర్ కూడా షేర్ చేసారు…
మొత్తానికి మిరాయి సినిమా ఈ ఏడాది రిలీజైన సినిమాల్లో అతి పెద్ద సినిమా గా నిలిచే అవకాశం ఉంది. ఆల్రెడీ సంక్రాంతికి వస్తున్నాం ౩౦౦ కోట్లు COLLECT చేసింది కదా. మరి మిరాయి ఆ సినిమా కలెక్షన్స్ ని క్రాస్ చేస్తుందో లేదో చూడాలి!