ఇప్పుడు అందరు మాట్లాడుకునేది తేజ సజ్జ మిరాయి సినిమా గురించే… అసలు ఆ ప్రొమోషన్స్ ఏంటి… ఆ పాటలు ఏంటి… ఆ ట్రైలర్ అన్ని సూపర్ గా ఉన్నాయ్ ఇంకా సినిమా పైన అంచనాలు పెంచేసాయి కదా…
ఐతే నిన్న రాత్రే ఈ సినిమా నుంచి మరో సూపర్ సాంగ్ రిలీజ్ చేసారు… ‘జైత్రయా…” పాట సినిమా లో తేజ ఎలా యోధుడిగా మారాడో చూపిస్తుంది… ఇంకా స్పెషల్ విషయం ఏంటంటే, ఈ పాట ని మన సంగీత గాన గాంధర్వుడు శంకర్ మహదేవన్ పాడడం… అందులో రిలీజైన క్షణం నుంచి యూట్యూబ్ లో ట్రేండింగ్ లోకి వెళ్ళిపోయింది…
మీరు కూడా ఒకసారి ఈ పాత వినండి మరి…
ఇక మిరాయి సినిమా డీటెయిల్స్ విషయానికి వస్తే, దీని రవి తేజ తో ఈగిల్ సినిమా తీసిన కార్తీక్ ఘట్టమనేని తెరక్కెక్కించగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు నిర్మించారు… తేజ హీరో ఐతే, మన మంచు మనోజ్ బ్లాక్ స్వోర్డ్ అదే విలన్ గా నటించాడు… ఇక మన “వైబ్ ఉంది…” భామ రితిక హీరోయిన్…
మిరాయి సినిమా ఈ నెల 12th న థియేటర్స్ లో రిలీజ్ అవ్వడానికి రెడీ గా ఉంది…