Native Async

ప్రధాని నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజు సందర్భంగా ‘Modi @75’ ప్రత్యేక గీతం విడుదల

Special Song ‘Modi @75’ Released on PM Narendra Modi’s 75th Birthday
Spread the love

ప్రధాని నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా శుభాకాంక్షల వర్షం కురుస్తున్న వేళ, ఆయనకు అంకితంగా ప్రత్యేక గీతం రూపుదిద్దుకుంది. ఈ పాటను పలు భారతీయ భాషల్లో రూపొందించడం విశేషం. తెలుగులో ఈ గీతానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి స్వరాలు సమకూర్చగా, తన ప్రత్యేక శైలిలో ఆలపించారు కూడా. ఆయనతో పాటు గాయని షగున్ సొధి, ఐరా ఉడుపి కూడా ఈ గీతానికి స్వరమందించారు.

‘మోదీ @75’ అనే పేరుతో వచ్చిన ఈ గీతానికి నదాన్ సాహిత్యం అందించగా, దేశ ప్రజల మనసుకు హత్తుకునేలా పదాలు అల్లారు. టీ-సిరీస్ బ్యానర్‌పై రూపొందిన ఈ వీడియోలో, మోదీ హయాంలో దేశ అభివృద్ధి దిశగా సాధించిన పలు విజయాలను విజువల్స్ రూపంలో చూపించారు.

భారతదేశం ఐక్యంగా ముందుకు సాగుతున్న ప్రతీ అడుగు, మోదీ నాయకత్వం దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తున్న తీరు, ఈ గీతం ద్వారా ప్రతిఫలించాయి. అందువల్ల ఇది కేవలం ఓ పాట మాత్రమే కాదు, దేశ ప్రగతికి ప్రతీకగా నిలిచే గీతమని చెప్పొచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *