నాని హీరోగా, శ్రికాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైస్’ సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తిని రగిలిస్తోంది. రిలీజ్ చేసిన తొలి గ్లింప్స్‌తోనే సోషల్ మీడియాలో బాగా హడావుడి చేసింది. అయితే ఈ ప్రాజెక్ట్‌లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటిస్తున్నారనే వార్త ఎప్పటినుంచో టాలీవుడ్‌లో ఓపెన్ సీక్రెట్‌లా మారింది. కానీ, అధికారికంగా మాత్రం ఎవరూ చెప్పలేదు. ఈ రోజు మాత్రం మోహన్ బాబు కూతురు మంజు లక్ష్మి తానే ఆ రహస్యాన్ని బయట పెట్టింది.
తన రాబోయే సినిమా ‘దక్ష’ ప్రెస్ మీట్‌లో మాట్లాడిన లక్ష్మి, “నాన్న ది ప్యారడైస్ మూవీలో చేస్తున్నారు” అని ప్రకటించింది. వెంటనే ఆ విషయం ఇంకా అధికారికంగా రాలేదని గుర్తు చేసుకుని కాసేపు సైలెంట్ అయింది. కానీ తర్వాత “ఇప్పుడు నేనే చెప్పేశాను, నాని దానిపై ఏం అనుకోడు అనుకుంటా” అంటూ నవ్వేసింది.
లక్ష్మి చెప్పినట్టుగానే, మోహన్ బాబు చేస్తున్న ఈ క్యారెక్టర్ ఆయన కెరీర్‌లో ఒక come back లాంటిదే. ఆ రోల్ కోసం ఆయన జిమ్‌లో కష్టపడుతూ, మసిల్స్ పెంచుకుంటున్నారు. ఈ వయసులో సౌకర్యంగా విశ్రాంతి తీసుకోవచ్చని తెలిసినా, పాత్ర కోసం ఇంత కష్టపడటం ఆయన డెడికేషన్‌కు నిదర్శనం. అంతేకాదు, సినిమాలో యాక్షన్ సీన్స్ కూడా ఉంటాయని, అందుకే ఆయన బాడీ మీద ఎక్కువగా వర్కౌట్ చేస్తున్నారని తెలుస్తోంది.
దర్శకుడు శ్రికాంత్ ఓదెల ప్రత్యేకంగా మోహన్ బాబు కోసం ఈ రోల్ డిజైన్ చేశాడట. ఆయనకే కూడా ఈ క్యారెక్టర్ అంటే ఎనలేని ఎగ్జైట్మెంట్ ఉందని సమాచారం. మరోవైపు హీరోయిన్‌గా కాయాదు లోహార్ నటిస్తోంది. షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.
మోహన్ బాబు చేసే ఈ పవర్‌ఫుల్ పాత్రతో, మళ్ళీ ఒకసారి ఆయన వైపు అందరి చూపులు మళ్లిపోవడం ఖాయం. ఇక ఈ విషయంపై అధికారిక ప్రకటన కోసం మాత్రం మనమందరం ఎదురుచూడాల్సిందే.