వామ్మో… వాయ్యో… ఇందిరా ఇది… మన మోహన్ బాబు ని ఒక భయంకరమైన విలన్ గా పరిచయం చేసారు కదా! మొన్నే మోహన్ బాబు కూతురు లక్ష్మి మంచు, నాన్నగారు నాని తో కలిసి పారడైస్ సినిమా లో చేస్తున్నారు అని నోరు జారింది… ఇక ఆలస్యం ఎందుకు అనుకున్నారేమో టీం, అందుకే ఈరోజు మోహన్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసేసారు…

ఇక మోహన్ బాబు ని శికంజా మాలిక్ గా పరిచయం చేసేసారు… ఒక చేతి కింద కత్తి, వెనకాల గన్, ఇంకో చేతిలో సిగార్ ఇంకా చేతుల నిండా రక్తం… అబ్బో, కళ్ళజోడు, ఆ స్టైల్ ఇంకా షర్ట్ లెస్ స్వాగ్… అబ్బో చంపేశాడు పో!
మోహన్ బాబు కూడా తన పోస్టర్ ని షేర్ చేస్తూ, “Stepping into the shadows as SHIKANJA MAALIK in #𝐓𝐡𝐞𝐏𝐚𝐫𝐚𝐝𝐢𝐬𝐞—my name, my game, my revenge. @odela_srikanth’s vision is raw and gripping. This one’s built to hit hard. In theaters March 26, 2026. Get Ready for the intensity!” అని తన ఫాన్స్ కి ఒక పెద్ద ట్రీట్ ఇచ్చాడు…
ఈ సినిమాలో నాని హీరో అన్న సంగతి తెలిసిందే కదా… పైగా నాని శ్రీకాంత్ తో చేస్తున్న సెకండ్ డార్క్ యాక్షన్ థ్రిల్లర్. కాబట్టి, అంచనాలు వేరే లెవెల్ లో ఉన్నాయ్…
ఇక స్టోరీ విషయానికి వస్తే, 1980ల సికింద్రాబాద్‌లో, అణగారిన ఒక తెగ వివక్షను ఎదుర్కొంటూ, పౌరసత్వం కోసం పోరాటం చేస్తుంది. ఈ ప్రయాణంలో, అనుకోని నాయకుడి మార్గదర్శకత్వంలో వారు వ్యవస్థాగత అణచివేతకు సవాల్ విసురుతారు. ఆ నాయకుడు నాని ఐతే, మోహన్ బాబు విలన్ అన్నమాట. నాని ఆల్రెడీ రెండు జడలతో భయంకరంగా కనబడ్డాడు…
మర్చిపోకండి సినిమా ఐతే, మార్చ్ లో రిలీజ్ అవ్వడానికి రెడీ గా ఉంటుంది!