నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే టాలీవుడ్ లో ఒక మాస్ సంబరం. సింహా, లెజెండ్, అఖండ… ఇలా వరుస హిట్స్ ఇచ్చిన ఈ జంట ఇప్పుడు అఖండ 2 తో వస్తోంది. మొదట ఈ సినిమా ఈ నెలలోనే థియేటర్స్ లోకి రావాల్సి ఉండగా, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యం కావడంతో రిలీజ్ డేట్ క్లారిటీ రాలేదు.
అయితే ఆ క్లారిటీని ఎవరో కాదు… స్వయంగా బాలయ్యే ఇచ్చేశారు. అదీ ఏంటో తెలుసా? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోనే! సభలో ఎమ్మెల్యేలు, మంత్రులు బాలయ్యని అఖండ 2 ఎప్పుడు వస్తుందంటూ అడిగారు. అప్పుడు బాలయ్య స్టైల్లోనే మాట్లాడుతూ… “ముందు OG చూడండి, అది మర్నాడు రిలీజ్ అవుతోంది. ఇక OG డిసెంబర్ 5న వస్తుంది” అంటూ కన్ఫర్మ్ చేశారు.
గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ డిసెంబర్ 5 తేదీని అసలే రాజాసాబ్ మూవీ కోసం లాక్ చేశారు. కానీ వాళ్లు తర్వాత సంక్రాంతికి మార్చుకోవడంతో, ఇప్పుడు ఆ డేట్ OG దగ్గరికి వచ్చింది.
ఇక అఖండ 2 విషయానికి వస్తే, బాలయ్య మాట్లాడుతూ… త్వరలోనే ప్రమోషన్స్ మొదలవుతాయని, కంటెంట్ పై తనకున్న నమ్మకం చాలా బలంగా ఉందని చెప్పారు. హిందీ డబ్బింగ్ కూడా బాగానే వస్తోందని, ఆ వెర్షన్ కూడా ప్రేక్షకుల్ని ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని చెప్పారు.
ఇదే కదా బాలయ్య స్టైల్! సభలోనైనా, బయటైనా తన సినిమాలపై ఎంత నమ్మకమో అలాగే చూపిస్తారు. ఇక బోయపాటి-బాలయ్య కాంబినేషన్ కి మాస్ ప్రేక్షకులలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. థమన్ మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్ గా వచ్చాడు అంటే ఆ మాస్ బీట్ లతో థియేటర్స్ మోత మోగడం ఖాయం.
మరి కొత్త పోస్టర్స్, టీజర్ లాంటివి దసరా లేదా దీపావళి సమయంలో రాబోతున్నాయని టాక్. మొత్తానికి… అఖండ 2 కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు అసెంబ్లీ లోనే బాలయ్య ఇచ్చిన అప్‌డేట్ ఇప్పుడు సంబరాలు తెప్పిస్తోంది!