శర్వా నటిస్తున్న ‘నారి నారి నడుమ మురారి’ సంక్రాంతి బరిలో ఉంది అని మనకి తెలుసు కదా… పండగ సినిమా అంటే శర్వా అన్నట్టు ఫామిలీ ఎంటెర్టైనెర్స్ తో మన ముందుకు వస్తాడు… ఇక ఈ సరి నారి నారి నడుమ మురారి ‘సామజవరగమనా’ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కాబట్టి, ఇంకా కొంచం హాస్యం జోడించాడు డైరెక్టర్. రిలీజ్ డేట్ దెగ్గర పడుతుండడం తో టీజర్ కూడా ఇందాకే రిలీజ్ చేసారు… మీరు చూసేయండి:
టీజర్ సరదా టోన్‌తో ప్రారంభమవుతుంది. శర్వా పాత్ర తన గర్ల్‌ఫ్రెండ్‌ను కలవడానికి ఆటోలో వెళ్తుండగా, ఆమె తండ్రితో ఎదురయ్యే అనుకోని పరిస్థితులు కథలో మలుపు తిప్పుతాయి. పెళ్లికి సంబంధించిన కొన్ని షరతులు విధించడం వల్ల పరిస్థితి కాస్త క్లిష్టంగా మారుతుంది. ఇదే సమయంలో శర్వా మాజీ గర్ల్‌ఫ్రెండ్ అతని ఆఫీస్‌లోనే సహోద్యోగిగా ప్రవేశించడం అతని జీవితాన్ని పూర్తిగా తలకిందులు చేస్తుంది. అక్కడినుంచి కథ మొత్తం గందరగోళం, ఇద్దరు భామల మధ్య శర్వా ఇరుకున్నట్టు చూపిస్తారు.
మాజీ ప్రేమికగా సమ్యుక్తా ఆకట్టుకుంటే, గర్ల్‌ఫ్రెండ్ పాత్రలో సాక్షి వైద్య కూడా మెరిసింది. నరేష్, సత్య, సునీల్, సుదర్శన్, సంపత్ రాజ్‌లతో కూడిన సహనట బృందం సినిమాకు మరింత కామెడీ బలాన్ని అందించనుందని టీజర్‌లోనే అర్థమవుతుంది.
మొత్తానికి, ‘నారి నారి నడుమ మురారి’ టీజర్ ఈ సినిమా సంక్రాంతి సెలవుల్లో కుటుంబమంతా కలిసి ఆస్వాదించదగిన సంపూర్ణ వినోదాత్మక చిత్రంగా నిలుస్తుందనే నమ్మకాన్ని బలంగా కలిగిస్తోంది.