ఆల్రెడీ థియేటర్స్ లో దసరా సినిమాల హవా మొదలైంది కాబట్టి, ఇక దీపావళి, క్రిస్మస్ మాత్రమే మిగిలాయి ఈ ఏడాది… ఐతే బాలయ్య ఆల్రెడీ నిన్ననే అఖండ 2 డిసెంబర్ లో విడుదల చేస్తున్నాం అన్నాడు… సో, డిసెంబర్ లో కూడా పెద్ద మూవీస్ ఉన్నాయ్! ఇక మిగిలింది సంక్రాంతి… ఆమ్మో ఆల్రెడీ మన శంకర్ వర ప్రసాద్ గారు కర్చీఫ్ వేసేసారు కదా. అయ్యో ప్రభాస్ రాజా సాబ్ మర్చిపోతే ఎలా???
ఇంకా అటు డబ్బింగ్ సినిమాలు విజయ్ ‘జన నయగన్’ ఇంకా రవి తేజ సినిమా కూడా ఉంటుంది అంటున్నారు… సో, మరి ఈ టైం ఈ కుర్ర హీరో ఐన రిస్క్ చేస్తాడా???
ఎస్… చేస్తాను అంటున్నాడు నవీన్ పోలిశెట్టి… ఎందుకంటే అతని ‘అనగనగ ఒక రాజు’ సినిమా కూడా సంక్రాంతి బరిలో ఉంది. అలానే, రేపు రిలీజ్ అయ్యే పవన్ కళ్యాణ్ OG సినిమా తో పాటు థియేటర్స్ లో ఈ సినిమా ప్రోమో కూడా స్ట్రీమ్ అవుతుంది అంట…
నిర్మాతలు ఈ న్యూస్ ట్విట్టర్ లో షేర్ చేస్తూ, OG తో అనగనగ ఒక రాజు అంటున్నారు…
ఈ సినిమా లో మీనాక్షి హీరోయిన్ కాగా, మిక్కీ J మేయర్ సంగీత దర్శకుడు… సో, పండగ వేళ రాజి వస్తాడు అనమాట!