OG … OG … OG … ఇలా రెండు తెలుగు రాష్ట్రాలు ఈ సినిమా పేరే తలుస్తున్నాయి. మరి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఆ మాత్రం ఉండాలి కదా. పైగా ఇది ఒక మెగా మాస్ అండర్ వరల్డ్ డ్రామా అని, మన పవన్ కళ్యాణ్ ఓజాస్ గంభీర గా అదరగొట్టబోతున్నాడని ఆల్రెడీ ట్రైలర్ లో చూసాం కదా…
సినిమా రిలీజ్ కి ఇంకా రెండు రోజులే ఉండడం తో, ఆల్రెడీ ప్రొమొతిఒన్స్ వేగంగా సాగుతున్నాయి. అలాగే సినిమా లోని ముఖ్యమైన పాత్రల్ని కూడా రెవీల్ చేసారు నిర్మాతలు…
ట్విట్టర్ లో ఈ సినిమాలో ముఖ్య భాగమైన హరీష్ ఉత్తమన్ ఇంకా రాహుల్ రవీంద్రన్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ చేసి, అంచనాలు మరింత పెంచారు…
రాహుల్ రవీంద్రన్ ని భద్ర గా పరిచయం చేసి ఒక మధ్య వయస్కుడిగా చూపించారు. ఇక హరీష్ ని దీననాథ్ గా పరిచయం చేసి ఒక విలన్ లా చూపించారు.
ఈ సినిమా లో ఇంకా ప్రియాంక అరుళ్ మోహన్, రావు రమేష్, ఇమ్రాన్ హష్మీ, శుభలేఖ సుధాకర్, ప్రకాష్ రాజ్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ కూడా ఉన్నారు…