పవన్ కళ్యాణ్ కి చాల కాలం తరువాత పెద్ద హిట్ అందించిన సినిమా OG … ఈ సినిమా ని యంగ్ దర్శకుడు సుజీత్ చాలా బాగా, పవన్ స్టైల్ కి స్వాగ్ కి తగ్గట్టు గా తీసాడు… పైగా ఈ సినిమా కి సీక్వెల్, ప్రీక్వెల్ రెండు ఉంటాయి అని ప్రకటించి ఇంకా హైప్ పెంచేసాడు…
ఐతే ఈ సినిమా ని థియేటర్స్ లో చుసిన వారందరు కూడా, OTT లో మళ్లీ ఒకసారి చూడాలని గట్టిగా వెయిటింగ్! కానీ సినిమా పెద్ద హిట్ అయ్యింది కాబట్టి, చాల రోజులు వెయిట్ చేయాలి అనుకున్నారు…
కానీ OG సినిమా నెల రోజుల్లోనే OTT లోకి వచ్చేస్తుంది… అక్టోబర్ 23 న దీపావళి సందర్బంగా నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవ్వబోతోంది. ఈ పెద్ద న్యూస్ ని నిర్మాతలు సోషల్ మీడియా లో షేర్ చేసి పవన్ ఫాన్స్ కి పండగలాంటి వార్త ని చెప్పారు…
OG లో ప్రియాంక మోహన్, ఇమ్రాన్ హష్మీ, శ్రియ రెడ్డి, అర్జున్ దాస్, ప్రకాస్జ్ రాజ్ ఇంకా శుభలేఖ సుధాకర్ కీలక పాత్రల్లో నటించారు… ఆల్మోస్ట్ 500 కలెక్ట్ చేసింది ఈ సినిమా. సో, మరి OTT లో ఎన్ని రికార్డ్స్ బద్దలు కొడుతుందో చూద్దాం!