పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన OG సెప్టెంబర్ 25న విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటోంది. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పవన్ కల్యాణ్ స్టైలిష్ పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించడం అభిమానులను బాగా నచ్చింది.
యాక్టుల్ గా ఈ సినిమా కోసం డిసెంబర్ 2024లో బ్యాంకాక్‌లో నేహా శెట్టి ఒక స్పెషల్ సాంగ్ చేయించారు. అయితే ఆ పాటను ఫైనల్ గా పెద్ద స్క్రీన్స్ లో కనిపించలేదు. రిలీజ్ తర్వాత సుజీత్, థమన్ ఇద్దరూ “ఆ పాట సినిమాకు సరిపోలదని ముందే తీసేశాం, అని చెప్పారు…
తర్వాత సంగీత దర్శకుడు థమన్ మీడియాతో మాట్లాడుతూ, “ఆ స్పెషల్ సాంగ్ సినిమా ఫ్లోని ప్రభావితం చేసింది, అందుకే తీసేశాం. కానీ ఇప్పుడు కొత్త ఆలోచన వచ్చింది. అందుకే దాన్ని తిరిగి చేర్చుతున్నాం” అని తెలిపారు.
ఇక “కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్” అనే టైటిల్‌తో వచ్చిన ఈ పాట మంగళవారం సాయంత్రం షోస్ నుంచి థియేటర్స్‌లో చేర్చబడింది. థమన్ స్టైల్లో కంపోజ్ చేసిన ఈ పాటలో నేహా శెట్టి అద్భుతంగా మెరిసింది. అయితే ఈ పాటలో పవన్ కల్యాణ్ కనిపించకపోయినా, థియేటర్స్‌లో అభిమానులను ఆకట్టుకుంటోంది.
ఓపెనింగ్ వీకెండ్ హిట్ తర్వాత, చిత్ర బృందం బుధవారం హైదరాబాద్‌లో ఒక సక్సెస్ మీట్ జరపబోతున్నట్లు ప్రకటించింది. OGలో పవన్ కల్యాణ్‌తో పాటు ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్, నేహా శెట్టి, అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి, ప్రకాశ్ రాజ్ ముఖ్య పాత్రల్లో నటించారు.