అబ్బా… అబ్బా… అబ్బా… సినిమా అదిరిపోయిందండి! మాములుగా కాదు! దుమ్ము దులిపి దంచి కొట్టింది… ఇది నిజం! మన పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో ఎలాంటి కం బ్యాక్ ఇచ్చాడో చూసాం కదా. కొడితే కుంభ స్థలాన్ని కొట్టాలి అన్నట్టు, పోటీ చేసిన 21 సీట్లు గెలిచి సత్తా చూపించాడు.
అలాగే కం బ్యాక్ లో కూడా OG తో తానేంటో మళ్ళి నిరూపించాడు… రెండు తెలుగు రాష్ట్రాలే కాదు, మొత్తం నార్త్ అమెరికా కూడా మారు మోగిపోతుంది. ఆ ఫాన్స్ కళ్ళల్లో ఆనందం చూస్తుంటే ఉంది మాస్టారు, మన కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి…
మరి సుజీత్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి… మొన్న జరిగిన OG కాన్సర్ట్ లో పవన్ సుజీత్ గురించి చెప్తూ, తాను నాకు పెద్ద ఫ్యాన్… జానీ సినిమా చూసి తలకి బ్యాండ్ నెల రోజులు తీయలేదంట అని చెప్తూ, OG తో అదరగొట్టబోతున్నాం అని చెప్పాడు.
అలానే జరిగింది… అసలు థమన్ ఐతే టైటిల్ కార్డు తోనే డ్యూటీ ఎక్కేసి, చంపేశాడు…

ఇక స్టోరీ విషయానికి వస్తే, ఒక గురువు ప్రకాష్ రాజ్… అతనే సత్య దాదా… మరి గురువుకి కష్టం వస్తే శిష్యుడు OG ఊరుకుంటాడా??? తాట తీసి దంచి కొడతాడు. అసలు సినిమాని సుజీత్ జపాన్‌లోని యకుజా, సమురాయ్ వంశాల మధ్య కథని చెబుతూ, ఆ తరవాత OG గురించి, అసలు OG ముంబై లో ఎలా ఊచ కొత్త కోసి, అజ్ఞ్యాతం లోకి వెళ్ళాడో చూపించి, మళ్ళి పదేళ్ల తరువాత తన గురువు, గురువు రాజ్యానికి ఇమ్రాన్ హష్మీ వల్ల వచ్చే ఆపద నుంచి కాపాడతాడు.
అలానే ప్రియాంక చాల చక్కగా కనిపించింది… మన పవన్ ని ఖుషి రోజుల్లో చూసి నట్టు, ఆ సాంగ్స్, రొమాన్స్, ప్రేమ… అబ్బో సూపర్ అసలా…
ఇక మళ్ళి ముంబై లో అడుగు పెట్టిన OG , ఇమ్రాన్ ని చావగొట్టి, సత్య దాదా కి తాను ఇచ్చిన మాటని నిలబెడతాడు… స్టోరీ సింపుల్ కానీ ఎలేవేషన్స్ అదుర్స్! సినిమా చూడాలి… మళ్ళి మళ్ళి చూడాలి… ఆ BGM ని నెత్తికి ఎక్కించుకుని, దసరా పండగ ఎంజాయ్ చేస్తూ, డాన్స్ లు చేయాలి… ఇది మా రివ్యూ… ఎం అంటారు మీరు???
పాజిటివ్ పాయింట్స్:
ఫస్ట్ మన OG పవన్ కళ్యాణ్… అతని ఎలేవేషన్స్…
ప్రియాంక మోహన్ క్లాస్సి టచ్…
BGM compulsary
ఇక సుజీత్ టేకింగ్ కి దండం భయ్యా…
మాకైతే నెగటివ్ పాయింట్స్ ఏమి లేవు…
ఇక రేటింగ్ ఐతే 4 /5
ఉంటాం మరి… మళ్ళి సినిమా చూసొస్తాము!