Native Async

పవన్ కళ్యాణ్ సర్ప్రైజ్ తో ‘వాషి యో వాషి’ సాంగ్… హైలైట్ అవుతున్న OG!

Pawan Kalyan’s Washi Yo Washi Song from OG Creates Buzz Ahead of Release
Spread the love

ఇప్పుడు ఎక్కడ చుసిన OG మాయ నడుస్తుంది… ఈ సినిమా 25th న రిలీజ్ అవుతుంది కాబట్టి, మొత్తం టీం అంతా ప్రొమోషన్స్ లో బిజీ గా ఉన్నారు. అందులో భాగంగా, నిన్న రాత్రి పవన్ కళ్యాణ్ పాడిన “వాషి వాషి…” సాంగ్ రిలీజ్ చేసారు…

సినిమా విడుదలకు ముందు నుంచే ప్రమోషనల్ మెటీరియల్‌తో అభిమానుల్లో హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఆల్రెడీ థమన్ ఎస్ స్వరపరిచిన ‘ఫైర్‌ స్టార్మ్’, ‘సువ్వి సువ్వి’, ‘గన్స్ అండ్ రోజెస్’ లాంటి పాటలు ఇప్పటికే పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.

ఇప్పుడు వాటికి తోడు టీమ్ ఒక ప్రత్యేకమైన సాంగ్‌ను రిలీజ్ ఐంది– అదే “వాషి యో వాషి”. ఈ పాటను స్వయంగా పవన్ కళ్యాణ్ పాడడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. డైరెక్టర్ సుజీత్ రాసిన జపనీస్ హైకూ లిరిక్స్‌తో ఓజస్ తన శత్రువు ఒమీ (ఇమ్రాన్ హాష్మి పాత్ర)ని ఛాలెంజ్ చేసే విధంగా సాంగ్ సాగుతుంది. ఈ మ్యూజిక్‌లో శివమణి వాయించిన జపనీస్, నకోడా డ్రమ్స్ వినిపిస్తూ డ్రమాటిక్ ఫీల్ ఇస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ రికార్డింగ్ స్టూడియోలో ఈ పాట పాడుతున్న వీడియో, ఆయనే రాసుకున్న తెలుగు లిరిక్ షీట్ ఫొటోలు కూడా రిలీజ్ కావడంతో ఫ్యాన్స్ ఆనందంతో మునిగిపోయారు. “వాషి యో వాషి”లో పవన్ ఎనర్జీకి నెటిజన్స్ మైమరచి పోయి పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ గొంతు సవరించుకుంటే ఫాన్స్ ఊరుకుంటారా??? అందుకే ఇప్పుడు వాషి వాషి పాటనే అన్నిట్లో ట్రేండింగ్… మీరు ఒకసారి వినేయండి…

ఇక లాస్ట్ గా ఈ సాంగ్ లిరిక్స్ కూడా చూసేయండి… మీరు పాట పాడండి మరి!

ఈ సినిమా లో ఓజస్ పాత్రలో పవన్ కళ్యాణ్ నటిస్తుండగా, ఇమ్రాన్ హాష్మి, ప్రియాంకా అరుల్ మోహన్, ప్రకాశ్ రాజ్, శ్రీయా రెడ్డి కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఇక రిలీజ్ విషయానికి వస్తే, సెప్టెంబర్ 24న రాత్రి 9 గంటలకు తెలంగాణలో, సెప్టెంబర్ 25న ఉదయం 1 గంటకు ఆంధ్రప్రదేశ్‌లో OG ప్రీమియర్ షోలు జరగనున్నాయి. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌తో పవర్ స్టార్ సినిమాకు రెడ్ కార్పెట్ రెడీ అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *