ఇంకా ఒక రోజులో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన OG సినిమా రిలీజ్ కాబోతుంది. ఈరోజు నుంచే పేడ్ ప్రీమియర్స్ కూడా ప్లాన్ చేశారు. అయితే ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ ఆరోగ్యం గురించి ఒక షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ప్రస్తుతం ఆయన వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారని ఆయన టీమ్ కన్ఫర్మ్ చేసింది.
ప్రి-రిలీజ్ ఈవెంట్ కి హాజరైనప్పుడు పవన్ సుమారు 30-40 నిమిషాల పాటు వర్షంలో తడిసిపోయారు. అదే కారణంగా వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చి ఫీవర్ వచ్చినట్లు భావిస్తున్నారు. అయినా కూడా పవన్ వెనకడుగు వేయకుండా సోమవారం అమరావతి వెళ్లి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ఆ సమయంలో కూడా ఆయన ఫీవర్ తోనే ఉన్నారు.
“డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు గత రెండు రోజులుగా వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. అయినా కూడా సోమవారం అసెంబ్లీకి హాజరయ్యారు, అధికారులతో రివ్యూలు నిర్వహించారు. సోమవారం రాత్రి నుంచి ఫీవర్ తీవ్రత పెరిగింది. ఈ క్రమంలో వైద్యులు పరీక్షలు చేసి, చికిత్స అందిస్తున్నారు. కొంత విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇచ్చారు. అయినా కూడా ఆయన డిపార్ట్‌మెంటల్ విషయాలపై అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు,” అని పవన్ పబ్లిసిస్ట్ ఒక స్టేట్మెంట్ లో వెల్లడించారు.
ఇక మరోవైపు, OG అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే రికార్డ్ ఓపెనింగ్ సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.