అటు పాలిటిక్స్, ఇటు సినిమాలు… ఇంక వైపు సనాతన ధర్మం… ఇలా నిత్యం బిజీ గా ఉంటున్నారు మన పవన్ కళ్యాణ్. మొన్న జోరు వాన లో OG సినిమా ట్రైలర్ ని డైరెక్టర్ సుజిత్ ని ఒప్పించి మరి ప్లే చేసేలా చేసాడు… సినిమా రిలీజ్ అయ్యింది… ఫుల్ హిట్ కూడా అయ్యింది… కానీ మన హీరో పవన్ కళ్యాణ్ తీవ్ర జ్వరం తో బాధపడుతున్నారు అంట…
ఈ విషయం, జన సేన పార్టీ official ట్విట్టర్ లో కూడా పోస్ట్ చేసారు…
“రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు వైరల్ జ్వరంతో బాధపడుతున్నారు. గత నాలుగు రోజులుగా వైద్యం చేయించుకొంటున్నారు.
•జ్వరం తీవ్రత తగ్గలేదు. దగ్గు ఎక్కువగా ఉండటంతో ఇబ్బందిపడుతున్నారు.
•వైద్యుల సూచనల మేరకు హైదరాబాద్ లో వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు. ఈ రోజు శ్రీ పవన్ కల్యాణ్ గారు మంగళగిరి నుంచి హైదరాబాద్ వెళ్తారు.”
ఈ పోస్ట్ కి CM చంద్ర బాబు నాయుడు గారు కూడా స్పందించి, పవన్ కళ్యాణ్ తొందరగా కోలుకోవాలని ఆశించారు…
ఒక పక్క OG జోరు మామూలుగు గా లేదు దుమ్ము దులిపేస్తుంది… మొదటి రోజే సినిమా 100 కోట్ల కలెక్షన్ దాటేసింది!