మెగా ఫాన్స్ అందరు ప్రస్తుతం డబుల్ సెలెబ్రేషన్స్ చేసుకుంటున్నారు… రామ్ చరణ్ ఉపాసన కి ఇప్పుడు ట్విన్స్ పుట్టబోతున్నారన్న సంతోషమైన వార్త అందరిని ఖుష్ చేసింది. దీపావళి సందర్బంగా కుటుంబ సభ్యులు, సినీ మిత్రుల సమక్షం లో సీమంతం ఘనంగా జరిగింది…
ఇక రామ్ చరణ్ సినిమాలకి సంబందించిన లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన రాబోయే పాన్ ఇండియా స్పెక్టాకిల్ ‘పెద్దీ’ లో పూర్తిగా భిన్నమైన, రగ్గడ్ లుక్ కరెక్టర్‌లో కనిపించబోతున్నాడు. సినిమాకి సంబంధించిన కొన్ని పాటలు ఇప్పటికే పూణేలో షూట్ అయ్యాయి.
ఇక ఈరోజు పెద్దీ టీమ్ తదుపరి షెడ్యూల్ కోసం శ్రీలంకకు బయలుదేరింది. రామ్ చరణ్, జాన్వి కపూర్ కాంబినేషన్‌లో ఒక రొమంటిక్ పాట ను శ్రీలంక లొకేషన్లలో షూట్ చేయనున్నారు.
సినిమా ప్రొడక్షన్ ఇంకా పోస్ట్-ప్రొడక్షన్ పనులు సమయానికి, ఎటువంటి ఆలస్యాలుండకుండా సాగుతున్నాయి. సినిమాలో శివరాజ్ కుమార్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపిస్తాడు. పెద్దీ సినిమా రామ్ చరణ్ పుట్టినరోజు, మార్చ్ 27 న పాన్-ఇండియా రిలీజ్ కావడం కూడా ఖరారు అయింది.
సో, మొత్తానికి మెగా అభిమానులకి అన్ని శుభవార్తలే…