పూజ హెగ్డే… కొంత కాలం క్రితం వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్… త్రివిక్రమ్ అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో…’ సినిమా లో అబ్బా పూజ ని చూస్తుంటే, మన బన్నీ లాగ, “సమజవరాగమనా…”, “బుట్ట బొమ్మ…” పాటలు పడుతూనే ఉండాలి అనిపిస్తుంది కదా… అంతలా అందరిని మాయ చేసింది పూజ. ప్రతి ఒక్క హీరో తో నటించి ఆలా అందరితో ఒక రౌండ్ వేసేసింది. ఐతే కొంత కాలంగా ఎందుకో తెలుగు సినిమాలు తగ్గాయి…
కానీ ఇన్నాళ్లకు, దుల్కర్ సల్మాన్ తో ఒక సినిమా సైన్ చేసింది… ఈ వార్త ని కంఫర్మ్ చేస్తూ, ఆ సినిమా నిర్మాతలు ఒక మేకింగ్ వీడియో కూడా రిలీజ్ చేసారు. ఆ వీడియో లో పూజ స్కూటీ రైడ్ చేస్తూ ఉండగా దుల్కర్ వెనుక కూర్చుని ఉంటాడు… అలానే పూజ కూడా మన పక్కింటి అమ్మాయి ల కనిపించి మెప్పించింది!
ఈ సినిమా ని Ravi నెలకుడితి తెరకెక్కిస్తుండగా, SLV సినిమాస్ బ్యానర్ నిర్మిస్తుంది… ఇది దుల్కర్ సల్మాన్ 41 వ సినిమా.