ప్రభాస్ పుట్టిన రోజు సందర్బంగా సోషల్ మీడియా లో ఫాన్స్ తమ డార్లింగ్ కోసం చాల ట్వీట్స్ చేస్తున్నారు. అందుకే #HBDPRABHAS ట్రేండింగ్ లో ఉంది… అలాగే రాజా సాబ్ Fauji సినిమా టైటిల్స్ కూడా ట్రేండింగ్ లో ఉన్నాయ్!
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఐదు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి, వాటిలో రెండు ఇప్పటికే షూటింగ్ దశలో ఉన్నాయి. అందుకే వచ్చే మూడు నుంచి నాలుగు సంవత్సరాలు పూర్తిగా సినిమాలతో బిజీగా ఉండబోతున్నారు ప్రభాస్. ప్రతి సంవత్సరం ఆయన బ్రాండ్ విలువ ఆకాశాన్నంటుతోంది.

ఇప్పుడు ఆయన తరువాతి సినిమా ది రాజా సాబ్, ఇది 2026 జనవరిలో విడుదల కానుంది. ఆ తర్వాత వస్తోంది హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్, ఇది ఇప్పటికే షూటింగ్ దశలో ఉంది.

ఇక మరోవైపు, సలార్ 2, కల్కి 2898 AD 2 వంటి భారీ సీక్వెల్స్ పై కూడా త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. ఇవన్నీ ప్రారంభం కావడానికి ముందు, ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కే స్పిరిట్ సినిమా చేయబోతున్నారు.

మొత్తం ఐదు ప్రాజెక్టుల విలువ రూ.4000 కోట్లకు పైగా ఉండనుంది. ప్రతి సినిమా కూడా భారీ స్థాయిలో తెరకెక్కుతున్నందున, ఒక్కో సినిమా ద్వారా 700 నుండి 1000 కోట్ల వరకు థియేట్రికల్ రికవరీ సాధ్యమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరోసారి హిట్ కొడితే ప్రభాస్ విలువ మరింత పెరగడం ఖాయం.
థియేట్రికల్ బిజినెస్ నుండి OTT రైట్స్ వరకు, ప్రభాస్ సినిమాలకు ఎప్పుడూ విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఆయన సినిమాలు రిలీజ్ కాకముందే రికార్డులు బద్దలు కొడతాయి. ఇంతటి స్థాయిలో స్థిరంగా ఎదుగుతున్న స్టార్‌గా, ప్రభాస్‌ను ప్రస్తుతం ఎవ్వరూ సులభంగా అందుకోలేరు.
భారతీయ సినీ పరిశ్రమలో ప్రభాస్ పేరు ఇప్పుడు ఒక శక్తి, ఒక బ్రాండ్, ఒక గౌరవం!
అందుకే మన బాహుబలి ప్రభాస్ – ఇన్‌డియన్ సినిమా కి నిజమైన గ్లోబల్ ఐకాన్!