2022లో మేమోరబుల్ లవ్ స్టోరీ ‘సీతా రామం’ తో ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకున్న దర్శకుడు హను రాఘవపూడి ఇప్పుడు 1940ల లో సెట్ అయిన పీరియడ్ డ్రామా పై పని చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో ప్రభాస్ కనిపించనున్నారు అన్న సంగతి తెలిసిందే…
ప్రస్తుతం, ప్రభాస్ ది రాజా సాబ్ రిలీజ్ కోసం సన్నాహాలు చేస్తున్నారు కాబట్టి, టిమ్ అప్‌డేట్స్‌ను అంతగా షేర్ చెయ్యట్లేదు. కానీ తాజా సమాచారం ప్రకారం, #PrabhasHanu చిత్ర షూట్ steady గా కొనసాగుతోంది. మొత్తం షూటింగ్‌లో సుమారు 60% పూర్తి అయ్యింది. ది రాజా సాబ్ ఇంకా ఈ చిత్రానికి ఒకేసారి షూట్ చేస్తున్న ప్రభాస్ ఫుల్ బిజీ గా ఉన్నాడు. అలాగే Fauji సినిమా షూటింగ్ ఇంకా సుమారు 35 రోజుల షెడ్యూల్ మాత్రమే మిగిలింది.

మేకర్స్ ఈ చిత్రాన్ని 2026లో Independence Day వీకెండ్ లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. Tentative date ఆగస్టు 14, శుక్రవారం. పెద్ద ఎత్తున పీరియడ్ ఫిల్మ్‌కు ఇది సరైన స్లాట్ అవుతుంది. 2025లో ఒక్క సినిమా లేకుండా ఉన్న ప్రభాస్, 2026లో రెండు పెద్ద చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు – ది రాజా సాబ్ ఇంకా ఫౌజీ.
హను రాఘవపూడి ఫ్రాంచైజ్ స్టోరిటెల్లింగ్ పై ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో, ప్రీక్వెల్ ఆలోచనను కూడా పరిశీలిస్తున్నారు.
ఈ చిత్రం మహిళా ప్రధాన పాత్రలో ఇమాన్వి డెబ్యుట్ చేస్తోంది. ముఖ్య పాత్రల్లో మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, జయప్రదా కనిపిస్తారు.
ఇక ప్రభాస్ వర్క్ ఫ్రంట్‌లో, ది రాజా సాబ్ ఇంకా ఫౌజీ తర్వాత, ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ చేస్తాడు. తరువాత, హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మతో కలిసి పనిచేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే సలార్ ఇంకా కల్కి సీక్వెల్స్ మీద కూడా లైన్ లో ఉన్నాయ్…