మనకి తెలిసిందే కదా కొన్ని రోజుల కిందటే ప్రభాస్ ఇంకా సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమా షూట్ స్టార్ట్ అయ్యింది అని… ఆలోగానే ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకున్నాడు ప్రభాస్. ఐతే స్పిరిట్ సినిమా లాంచ్ ఈవెంట్ లో అందరి పిక్స్ రిలీజ్ చేసారు కానీ ప్రభాస్ పిక్ రిలీజ్ చేయలేదు. ఎందుకు అంటే, ఆ సినిమా లో ప్రభాస్ ఎలా ఉంటాడో తెలియకూడదు అని. అందుకే ప్రభాస్ ఎలా ఉంటాడో అని అందరు ఈగర్ గా వెయిటింగ్!
కానీ ఈరోజు ప్రభాస్ జపాన్ వెళ్ళాడు కదా… బాహుబలి: ది ఎపిక్ సినిమా ప్రమోషన్స్ కోసం వెళ్ళాడు! కానీ స్పిరిట్ సినిమా లాంచ్ లోనే ప్రభాస్ ని కనిపించనీయని సందీప్ రెడ్డి, బాహుబలి స్క్రీనింగ్ లో మాత్రం ఆపలేకపోయాడు. ఈ పిక్స్ లో ప్రభాస్ చాల సన్నగా ఉన్నాడు.
Baahubali: The Epic స్పెషల్ స్క్రీనింగ్ కోసం అక్కడికి చేరుకున్న వెంటనే ప్రపంచ మీడియా మళ్లీ ఈ ప్రభాస్ పై ఫోకస్ పెట్టేసింది. అలాగే ప్రొమోషన్స్ కూడా షికారుకు చేరడంతో, జపాన్ అంతా బాహుబలి హంగామా నడుస్తోంది.
ఈ సందడిలో అందరి దృష్టిని ఆకర్షించిన విషయం — ప్రభాస్ కొత్త లీన్ లుక్!
ఇప్పటికే కొంతకాలంగా ప్రభాస్ ఏ ఈవెంట్‌కీ రానన్న రూమర్స్ వచ్చాయి. అదికాకుండా Fauzi లుక్ బయటికి రాకుండా బ్లాక్ హెడ్ క్లాత్‌తోనే కనిపిస్తున్నాడు అన్న వార్తలు కూడా ట్రెండ్ అయ్యాయి. కానీ జపాన్ ఈవెంట్ లో మాత్రం హెడ్ క్లాత్ లేకుండా, డైరెక్ట్‌గా లీన్ లుక్‌లో వచ్చి అభిమానులను పండగ చేసేశాడు.
అంతకుముందు వరకూ మాస్, మాచో స్టైల్‌తో కనిపించిన ప్రభాస్ — ఇప్పుడు ఇలా లీనర్, షార్ప్ లుక్‌లో కనిపించడం అభిమానుల్లో డబుల్ హైప్ క్రియేట్ చేసింది.
ఇక సందీప్ సినిమాల్లో హీరోలు ఎలా కనిపించాలన్నది ప్రత్యేకంగా చూసుకుంటాడని తెలిసిన విషయం. అందుకే Fauzi లో కాప్‌గా కనిపించనున్న ప్రభాస్ లుక్ గురించి ఇప్పుడు మరింత క్రేజ్ పెరిగింది.
అంతేకాకుండా ప్రభాస్ తదుపరి రిలీజ్ The Raja Saab, పాటు షూటింగ్ లో ఉన్న Fauzi — ఈ రెండు సినిమాలు కూడా హైప్ పై హైప్ క్రియేట్ చేస్తున్నాయి.
జపాన్ స్క్రీనింగ్‌కు హాజరై ప్రేక్షకుల మధ్య కూర్చొని బాహుబలిని చూసిన ప్రభాస్ — స్టార్ పవర్ ని మరోసారి ఫీలయ్యేలా చేశాడు.
మన బాహుబలి — ఏ లుక్‌లో వచ్చినా రికార్డులే!