ప్రస్తుతం బాహుబలి సినిమా జపాన్ లో రిలీజ్ అవుతుండడం తో ప్రభాస్ ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్లిన సంగతి తెలిసిందే… ఐతే ఈరోజే జపాన్ ఉత్తర తీరం లో భారీ భూకంపం వచ్చింది. అందుకే ప్రభాస్ ఫాన్స్ అందరు మా డార్లింగ్ ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు అని సోషల్ మీడియా లో questions వేస్తున్నారు…
దానికి రాజా సాబ్ సినిమా డైరెక్టర్ మారుతీ రిప్లై ఇస్తూ, ప్రభాస్ సేఫ్ అని చెప్పారు… ఇలా అయన రిప్లై రాగానే అందరు ఊపిరి పీల్చుకున్నారు…

“‘జపాన్‌లో భూకంపం వచ్చింది. సునామీ హెచ్చరికలు జారీ చేశారు. మా హీరో ఎక్కడ ఉన్నాడు. ఈరోజు సాయంత్రం రిటర్న్ అవుతాడా?’ అని ఓ అభిమాని మారుతిని అడుగుతూ పోస్ట్ పెట్టాడు. దీనికి ఆయన స్పందిస్తూ.. ‘ప్రభాస్‌తో ఇప్పుడే మాట్లాడాను. భూకంపం వచ్చిన ప్రాంతంలో ఆయన లేరు. ఆయన క్షేమంగా ఉన్నారు. ఆందోళన చెందకండి’ అని చెప్పడం తో అందరు హ్యాపీ ఫీల్ అయ్యారు…
ఇంతకీ మారుతీ ఇంకా ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్నా రాజా సాబ్ మూవీ వచ్చే సంక్రాంతికి రిలీజ్ అవ్వడానికి రెడీ గా ఉంది… ఇందులో ప్రభాస్ రెండు రొల్స్ లో కనిపిస్తాడు… సో, 9th జనవరి కోసం రెడీ గా ఉండండి!