బాహుబలి… సాలార్… కల్కి… ఇక ఇప్పుడు స్పిరిట్… ఇలా ప్రభాస్ ప్రతి సినిమా సోషల్ మీడియా లో బజ్ create చేస్తూనే ఉంది కదా! నిన్నే మన డార్లింగ్ గారి బర్త్డే సెలెబ్రేట్ చేసుకున్నాం. రాజా సాబ్ అప్డేట్ వచ్చింది సూపర్ గా అనిపించింది. కానీ మన సందీప్ రెడ్డి వంగ రాత్రి వరకు స్పిరిట్ సినిమా అప్డేట్ పోస్ట్ చేయలేదు. కానీ అద్ద రాత్రి సినిమా ప్రోమో రిలీజ్ చేసి షాక్ ఇచ్చాడు…
ఈ కొత్త పోలీస్ డ్రామా పై క్రేజ్, షూటింగ్ ప్రారంభమయ్యేముందే స్టార్ట్ అయ్యింది. ప్రభాస్ తన కెరీర్‌లో తొలిసారి పోలీస్ పాత్రలో కనిపించబోతున్న సినిమా కాబట్టి ప్రేక్షకులు ఇంకా ట్రేడ్ సర్కిల్స్‌లో హైప్ కి ఇది పెద్ద కారణం.
ఇక నిన్న ప్రభాస్ బర్త్డే సందర్భంగా, సందీప్ రెడ్డి వంగ ఒక పెద్ద సర్‌ప్రైజ్ ఇచ్చారు. తన స్టైల్ లో, సినిమా హీరో వ్యక్తిత్వంలోని హింసాత్మక గుణాలను చూపే ఆడియో స్నిప్పెట్‌ను రిలీజ్ చేశారు.
ఒక సీనియర్ అధికారితో సబార్డినేట్ మధ్య సంభాషణలో ప్రభాస్ IPS అధికారిగా ఉన్నప్పటికీ చిన్నవయసులో మొదలైన ‘వన్ బ్యాడ్ హాబిట్’ వల్ల రీమాండ్‌లో చేరినట్లు హింట్స్ ఇస్తుంది ఈ స్నిప్పెట్.
జైలు సూపరింటెండెంట్‌గా ప్రకాష్ రాజ్ వినిపిస్తూ, ప్రభాస్ బిహేవియర్ వల్ల ఉద్యోగం కోల్పోయాడని చెప్తాడు. ఆడియో చివరలో ప్రభాస్ డైలాగ్ “నా చిన్నతనం నుండి ఒక చెడు అలవాటు ఉంది” తో ముగుస్తుంది, అందుకే ప్రేక్షకుల్లో ఆసక్తి వేరే లెవెల్ కి వెళ్ళిపోయింది.
ప్రకాష్ రాజ్ మరో బలమైన, కథాత్మక పాత్రలో కనిపిస్తుండగా, బాలీవుడ్ నటుడు వివేక్ ఓబెరాయ్ ప్రతికూల పాత్రలో ఉండే అవకాశం ఉంది. సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే సంవత్సరం ప్రారంభమవుతుంది, ఇంకా ఈ సినిమా ని one పార్ట్ లోనే అది ఒకే సంవత్సరంలో ముగించేందుకు దర్శకుడు ప్లాన్ చేస్తున్నారు. కథానాయికగా త్రిప్తి డిమిట్రి నటిస్తోంది.