ప్రభాస్ మారుతి రాజా సాబ్ సినిమా గురించి అందరు వెయిటింగ్ కదా… ఈ సినిమా తో ప్రభాస్ ఒక యంగ్ హీరో లా… LOVER BOY ఇమేజ్ ఉన్నవాడిలా కనిపించనున్నాడు కదా… పైగా ఇది దయ్యం సినిమా అని, ఆల్రెడీ టీజర్ లో ప్రభాస్ క్యారెక్టర్ కి ఉన్న వేరియేషన్స్ చూసాం కదా. మారుతి స్టైల్ కనిపించి, కొంచం expectations ని పెంచేసింది టీజర్. ఐతే సినిమా ఫస్ట్ డిసెంబర్ లో రిలీజ్ చేస్తా అన్నారు కానీ కొంచం ఆలస్యంగా సరి కొత్తగా సంక్రాంతి బరిలో నిలవనుంది రాజా సాబ్…
ఈ విషయం ఎవరో కాదు, డైరెక్ట్ గా రాజా సాబ్ ప్రొడ్యూసర్ TG విశ్వా ప్రసాద్ ఏ చెప్పారు… ఐతే సంక్రాంతి కి ఆల్రెడీ అనిల్ రావిపూడి, చిరు సినిమా ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమా లైన్ లో ఉంది… అలాగే సూర్య KARUPPU, విజయ్ లాస్ట్ సినిమా ‘JANA NAYAGAN’ ఇంకా జూనియర్ ఎన్టీఆర్ ఇంకా ప్రశాంత్ నీల్ సినిమా లైన్ లో ఉన్నాయ్… అలాగే ఇప్పుడు రాజా సాబ్ కూడా ఆ స్లాట్ లో చేరింది…
ఐతే విశ్వ ప్రసాద్ సినిమా రిలీజ్ డేట్ ని కరెక్ట్ గా మీడియా కి చెప్పేసారు… సో, ప్రభాస్ ఫాన్స్ అందరు రెడీ గా ఉండండమ్మా 9th జనవరి కి… రాజా సాబ్ ని థియేటర్ లో చూడడానికి!
రాజా సాబ్ లో నిధి అగర్వాల్ హీరోయిన్… తనతో పాటు, సంజయ్ దత్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, బోమన్ ఇరానీ, జరీనా వాహబ్, Samruthrakani, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, VTV గణేష్, ప్రభాస్ శ్రీను, యోగి బాబు, సప్తగిరి, సుప్రీత్ రెడ్డి, వరలక్ష్మి శరత్ కుమార్, జిష్షు సేన్ గుప్త, నయనతార (స్పెషల్ సాంగ్) ఉన్నారు.
PEOPLE మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు ఈ సినిమా ని 5౦౦ కొత్త బడ్జెట్ తో నిర్మిస్తున్నారు… సో, హారర్ సినిమా కాబట్టి, గ్రాఫిక్స్ కి ఆ మాత్రం బడ్జెట్ కరెక్ట్ అంటున్నారు డార్లింగ్ ఫాన్స్… చూద్దాం!