అనుకున్న రిలీజ్ డేట్ కే ప్రభాస్ రాజా సాబ్…

Prabhas’ The Raja Saab Release Date Locked | No Postponement | Sankranti Treat Confirmed
Spread the love

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న ‘ద రాజా సాబ్’ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. హారర్, కామెడీ, ఎంటర్టైన్‌మెంట్ ఇలా అన్నీ కలిపి ఉన్న సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయ్. మొదట ఈ సినిమా డిసెంబర్ లోనే రిలీజ్ అవ్వాల్సి ఉండగా, VFX & పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా జనవరి 9కి మార్చారు.

ఇక గత కొన్ని రోజులగా సినిమా సంక్రాంతి పండగకీ రాదనీ, గ్రాఫిక్స్ వర్క్ కి టైం పడుతుందని అంటున్నారు… సినిమా మళ్లీ సమ్మర్ కి వెళ్లొచ్చని ఊహాగానాలు వచ్చాయి. ఫ్యాన్స్ కొంచెం టెన్షన్ పడేలోపే… పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ రూమర్స్‌కి అధికారికంగా క్లారిటీ ఇచ్చి ఫాన్స్ ని హ్యాపీ చేసింది.

ప్రొడ్యూసర్ టి.జి. విశ్వ ప్రసాద్ నేతృత్వంలో బ్యానర్ విడుదల చేసిన నోట్లో – అన్ని వార్తలు నిరాధారమని, జనవరి 9న release ఖాయం అని స్పష్టం చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు హై టెక్నికల్ స్టాండర్డ్స్ తో స్పీడ్ గా జరుగుతున్నాయని, ప్రేక్షకులకు భారీ విజువల్ అనుభవం ఇవ్వబోతున్నారని చెప్పుకొచ్చారు.

దర్శకుడు మారుతి రూపొందిస్తున్న ఈ చిత్రంలో హాన్టెడ్ ప్యాలెస్ నేపథ్యం, హారర్ తో పాటు గ్లామర్, కామెడీ, ఎమోషన్ అన్నీ పక్కా ఎంటర్టైన్‌మెంట్ గా మిక్స్ అవుతాయి. ఈ మాసివ్ ప్రాజెక్ట్ లో సంజయ్ దత్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. ట్రైలర్ తోనే థియేటర్లలో ఎలా పండగ వాతావరణం ఉండబోతుందో చూపించారు.

సో, జనవరి 9న థియేటర్లలో పండగ – The Raja Saab తో మరింత గ్రాండ్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🔔 Subscribe for Latest Articles
Share: FacebookX/TwitterTelegramWhatsAppLinkedInReddit