ప్రభాస్ నటిస్తున్న కొత్త సినిమా ‘ది రాజా సాబ్’ రాబోయే సంక్రాంతి 2026 కి రిలీజ్ కానుంది అన్న సంగతి తెలిసిందే. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ఇప్పటివరకు టీజర్ మాత్రమే విడుదల కాగా, ఫ్యాన్స్ మాత్రం ఆసక్తిగా ట్రైలర్ కోసం ఎదురు చూస్తున్నారు.
ఐతే నవరాత్రి సందర్బంగా ఈ ఆదివారం ఉదయం మేకర్స్ ఒక భారీ అప్‌డేట్ ఇచ్చారు. సెప్టెంబర్ 29వ తేదీ సాయంత్రం 6 గంటలకు ట్రైలర్ విడుదల కానుందని అధికారికంగా ప్రకటించారు. ప్రభాస్ – సంజయ్ దత్ లతో ఉన్న పోస్టర్ ని రిలీజ్ చేస్తూ, “ఫన్, ఫియర్ ఇంకా మజెస్టిక్ అనుభవాలకి రాయల్ ఎంట్రీ” అంటూ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఇక ట్రైలర్ విషయానికి వస్తే… సెన్సార్ బోర్డు నుండి U/A సర్టిఫికేట్ పొందింది. దీని రన్‌టైమ్ 3 నిమిషాలు 30 సెకన్లు ఉండబోతోంది. సాధారణంగా ట్రైలర్లు అంత పొడవుగా ఉండవు కానీ, ఇందులో హారర్, కామెడీ, రొమాన్స్ కలయికని చూపించబోతున్నారు. పైగా సినిమా రిలీజ్ కి ఇంకా మూడు నెలల గ్యాప్ ఉండగానే ట్రైలర్ రావడం చాలా స్పెషల్.
ది రాజా సాబ్ లో ప్రభాస్ సరసన మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని జనవరి 9, 2026 న థియేటర్లలో విడుదల చేయనున్నారు.