స్పిరిట్ దర్శకుడు సందీప్ కి బర్త్డే విషెస్ తెలిపిన డార్లింగ్ ప్రభాస్

Prabhas Wishes Sandeep Reddy Vanga on Birthday, Raises Hype for Spirit
Spread the love

టాలీవుడ్ పాపులర్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఈరోజు తన 44 వ పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు… అందుకే అయన ఫాన్స్ ఇంకా కో-డైరెక్టర్స్, యాక్టర్స్ అందరు సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలుపుతున్నారు. ఇక ప్రస్తుతానికి డార్లింగ్ ప్రభాస్ తో స్పిరిట్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే…

వరుసగా బ్లాక్‌బస్టర్ సినిమాలు అందించిన ఆయనకు ఈ ప్రత్యేక రోజున రెబల్ స్టార్ ప్రభాస్ సోషల్ మీడియా ద్వారా హార్ట్-ఫెల్ట్ శుభాకాంక్షలు తెలిపారు. అదే సమయంలో తమ రాబోయే చిత్రం ‘స్పిరిట్’ పై అంచనాలను మరింత పెంచారు.

“హ్యాపీ బర్త్‌డే బ్రో… నువ్వు ఏం సృష్టిస్తున్నావో అందరూ చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా” అంటూ ప్రభాస్ పోస్ట్ చేశారు. ఈ మాటలతో సినిమాపై, దర్శకుడిపై తనకున్న నమ్మకాన్ని, ప్రాజెక్ట్‌పై ఉన్న బజ్ ని పెంచేసాడు. ఈ పాన్ ఇండియా మూవీకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది.

‘స్పిరిట్’ సినిమాలో ప్రభాస్ ఒక fearless పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. ఇప్పటివరకు చూడని విధంగా పూర్తిగా రా, ఇంటెన్స్ అవతార్‌లో ఆయన ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు. ఈ చిత్రంలో త్రిప్తి దిమ్రి హీరోయిన్‌గా నటిస్తోంది.

ఇటీవల విడుదలైన వాయిస్ ఓవర్ గ్లింప్స్ ఒక్కటే సినిమాపై భారీ స్థాయిలో హైప్‌ను క్రియేట్ చేసింది. సినిమా ఎంత రా ఇంటెన్సిటీతో, ఎంత భారీ స్కేల్‌లో ఉండబోతోందో ఆ గ్లింప్స్ స్పష్టంగా సంకేతాలిచ్చింది.

ఇంకా వివేక్ ఆనంద్ ఒబెరాయ్ కూడా సందీప్ కి సోషల్ మీడియా ద్వారా బర్త్డే విషెస్ తెలియజెసారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🔔 Subscribe for Latest Articles
Share: FacebookX/TwitterTelegramWhatsAppLinkedInReddit