అందరూ ప్రిత్విరాజ్ సుకుమారన్ సినిమా ‘ఆడుజీవితం’ కి తప్పకుండా కనీసం ఒక నేషనల్ అవార్డు గెలుస్తుందని అనుకున్నారు. కానీ ఆ సినిమాకు ఒక్క అవార్డు ఇంకా గుర్తింపు రాకపోవడం అందరినీ షాక్‌కు గురి చేసింది. ఆ నిర్ణయంపై జ్యూరీని తీవ్రంగా విమర్శించారు కూడా చాల మంది సినిమా లవర్స్.
ఐతే చాలా రోజుల తర్వాత ఈ విషయంపై ప్రిత్విరాజ్ స్పందించారు. షార్జాలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన తన మనసులోని మాటను బయటపెట్టారు. “నేను ఈ సినిమాను ప్రేక్షకుల కోసం తీసాను గానీ జ్యూరీ కోసం కాదు” అని క్లియర్‌గా చెప్పారు.
ఇలాంటి సందర్భాల్లో ఎక్కువ మంది సినీ ప్రముఖులు చెప్పే మాటలానే ఇది అనిపించినా, ప్రిత్విరాజ్ చెప్పిన తీరులో నిజాయితీ కనిపించింది. సాధారణంగా అవార్డుల నిరాశ ఎదురైనప్పుడు “ప్రేక్షకుల ప్రేమే మాకు పెద్ద అవార్డు” అని అంటారు. కానీ ప్రిత్విరాజ్ మాటల్లో ఆ భావం మరింత బలంగా వినిపించింది.
“ఒక సినిమా జ్యూరీ కోసం కానీ, పది మంది చూసి మార్కులు వేయడానికి కానీ చేయబడదు. అంతర్జాతీయ ఫెస్టివల్స్‌కి మాత్రమే చూపించేందుకూ కాదు. సినిమాలు చివరికి ప్రేక్షకుల కోసమే. వారు థియేటర్‌కి వచ్చి ఆస్వాదించాలి. ఆ దృష్టిలో చూసుకుంటే, ఆడుజీవితంకి ప్రేక్షకులే ఇప్పటికే అతిపెద్ద అవార్డు ఇచ్చేశారు. దానికి నేను ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెబుతాను” అని ప్రిత్విరాజ్ హృదయపూర్వకంగా చెప్పారు.
ఇక వర్క్ ఫ్రంట్ విషయానికి వస్తే — ప్రిత్విరాజ్ సుకుమారన్ నెక్స్ట్ సినిమా ‘విలాయత్ బుద్ధా’ అనే థ్రిల్లర్. ఇటీవల ఆయన బాలీవుడ్ థ్రిల్లర్ ‘Sarzameen’ లో కూడా కనిపించారు.