పూరి జగన్నాధ్… అసలు ఈ డైరెక్టర్ కి ఉన్న ఫేమ్ ముమూల్ది కాదు! ఒక ఇడియట్, ఒక పోకిరి, ఒక Businessman ఇంకా అబ్బో చాల మంచి సినిమాలు ఉన్నాయ్ లిస్టులో! అందరు పెద్ద హీరో లకి మంచి హిట్స్ ఇచ్చాడు జూనియర్ NTR తో సహా!
ఇక రామ్ తో చేసిన డబల్ ఇస్మార్ట్ ఇంకా విజయ్ దేవరకొండ తో చేసిన Liger సినిమాలు పెద్ద ప్లాప్ అవ్వడం తో మళ్ళి కొత్తగా స్టార్ట్ చేయాల్సి వచ్చింది… అందుకే ఈసారి తమిళ్ హీరో విజయ్ సేతుపతి తో సినిమా చేస్తున్నాడు. ఇందులో టబు, సంయుక్త, దునియా విజయ్ ఇంకా బ్రహ్మాజీ నటిస్తున్నారు…
ఇంతకీ ఇప్పుడు మేటర్ ఏంటంటే, ఈ సినిమాని కూడా పూరి జస్ట్ నాలుగు నెలల్లోనే షూటింగ్ కంప్లీట్ చేసాడు… ఈ వార్త ని సోషల్ మీడియా లో కూడా షేర్ చేసారు నిర్మాతలు…
ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది జులై లో స్టార్ట్ అవ్వగా అప్పుడే కంప్లీట్ కూడా అయ్యింది… అలాగే ఈ సినిమాకి బెగ్గర్ అనే టైటిల్ పెట్టాలని అనుకుంటున్నారట.