Native Async

‘నటకిరీటి’ రాజేంద్రప్రసాద్ చేతుల మీదుగా ‘రోలుగుంట సూరి’ ఫస్ట్ లుక్ ఆవిష్కరణ

‘Natakiriti’ Rajendra Prasad Unveils Rolugunta Suri First Look
Spread the love

విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న రియలిస్టిక్ ఎమోషనల్ డ్రామా ‘రోలుగుంట సూరి’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రముఖ నటుడు ‘నటకిరీటి’ రాజేంద్రప్రసాద్ ఘనంగా ఆవిష్కరించారు. అనిల్ కుమార్ పల్లా దర్శకత్వంలో నాగార్జున పల్లా, ఆధ్యారెడ్డి, భావన నీలిపి హీరోహీరోయిన్లుగా తపస్వీ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై సౌమ్య చాందిని పల్లా నిర్మిస్తున్నారు.

ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించిన అనంతరం రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ – “ఇలాంటి సినిమాలు సైలెంట్‌గా వచ్చి పెద్ద సంచలనం సృష్టిస్తాయి. దర్శకుడు అనిల్ కుమార్ పల్లా హృదయాన్ని తాకే సబ్జెక్ట్‌ని చాలా అద్భుతంగా తెరపైకి తీసుకొస్తున్నారు. ఫస్ట్ లుక్ చాలా ఇంప్రెస్ చేసింది. సినిమా కూడా అలాగే అద్భుతంగా ఉండబోతోందనే నమ్మకం ఉంది, చిత్ర‌యూనిట్‌కు అభినంద‌న‌లు” అని అన్నారు.

దర్శకుడు అనిల్ కుమార్ పల్లా మాట్లాడుతూ – “మా సినిమా ఫస్ట్ లుక్‌ను ఆవిష్కరించిన నటకిరీటి రాజేంద్రప్రసాద్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆయన అభినందనలు మాకు మరింత నమ్మకం, ఉత్సాహం ఇచ్చాయి. అదే ఉత్సాహంతో సినిమాను మ‌రింతా అద్భుతంగా చిత్రించి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా కృషి చేస్తున్నాం,” అని తెలిపారు.

నిర్మాత సౌమ్య చాందిని పల్లా మాట్లాడుతూ – “‘రోలుగుంట సూరి’ ఒక రియలిస్టిక్ విలేజ్ డ్రామా. భావోద్వేగాలతో, జీవిత సత్యాలతో మిళితమైన ఈ కథ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. మా టీమ్‌లో ప్రతి ఒక్కరు అద్భుతంగా తమ ప్రతిభను చూపుతున్నారు. ఈ సినిమా తెలుగు సినీ చరిత్రలో నిలిచిపోయేలా అవుతుందనే నమ్మకం మాకు ఉంది,” అని తెలిపారు.

ఇలాంటి సినిమాలు గ్రామీణ జీవన శైలిని, భావోద్వేగాలను నిజ జీవితానికి దగ్గరగా చూపిస్తాయని యూనిట్ సభ్యులు తెలిపారు. ‘రోలుగుంట సూరి’ ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిరమైన స్థానం సంపాదిస్తుందనే నమ్మకం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *