మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ గ్రామీణ యాక్షన్ డ్రామా పెద్ది షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఐతే తాజా సమాచారం ప్రకారం, రేపటి నుండి సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది.
ఈ షెడ్యూల్‌లో పుణేలో రామ్‌చరణ్ – జాన్వి కపూర్‌లపై ఒక రొమాంటిక్ పాటను చిత్రీకరించబోతున్నారు. ఈ పాటను ఏఆర్ రెహ్మాన్ స్వరపరిచారు, జాని మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. మెలోడీతో పాటు ఎనర్జీ కలిపిన ఈ సాంగ్ రామ్‌చరణ్ – జాన్వి కెమిస్ట్రీని అద్భుతంగా చూపించబోతోందట. భిన్నమైన విజువల్స్‌తో ఈ పాట ఒక మ్యూజికల్ ట్రీట్‌గా ఉండబోతోందని యూనిట్ చెబుతోంది.

ఇప్పటికే సినిమాలో సగానికి పైగా షూటింగ్ పూర్తయింది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా సమాంతరంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా, సినిమా ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ ఇప్పటికే ముగిసింది. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు.
చిత్రబృందం తెలిపిన ప్రకారం, సినిమా రిలీజ్ డేట్‌లో ఎటువంటి మార్పు లేదు. శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ భారీ పాన్ ఇండియా చిత్రం మార్చి 27, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.