మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాన్ ఇండియన్ స్టార్… RRR తో ఆస్కార్ కూడా గెలుచుకున్నాడు. అదే సమయంలో, అన్ని ఇండస్ట్రీలతో, క్రీడా రంగంతో, ఇతర రంగాల ప్రముఖులతో చరణ్‌కు ఉన్న స్నేహ బంధాలు ప్రత్యేకమైనవి.
ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీ లెజెండ్స్‌తో పాటు భారత క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోనీ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం చాలా అరుదైన విషయం. ముఖ్యంగా ధోనీ సాధారణంగా లైమ్‌లైట్‌కు దూరంగా ఉండే వ్యక్తి కావడంతో, ఆయన ఏ స్టార్‌తోనైనా కలిసి కనిపిస్తే అది మరింత ప్రత్యేకంగా మారుతుంది. అలాంటి అరుదైన క్షణమే ఇప్పుడు అభిమానులను ఆశ్చర్యపరిచింది.

సల్మాన్ ఖాన్ 60వ పుట్టినరోజు వేడుకలో ఈ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. సల్మాన్‌తో మంచి స్నేహం ఉన్న రామ్ చరణ్, ప్రత్యేక ఆహ్వానంతో ఆ వేడుకకు హాజరయ్యారు. అక్కడ సల్మాన్ ఖాన్, ఎంఎస్ ధోనీ, బాబీ డియోల్‌లతో కలిసి రామ్ చరణ్ కనిపించడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. నిజంగా ఇది ‘టైటాన్స్ యూనియన్’ అనేలా కనిపించిన క్షణం. ఒకరినొకరు గౌరవిస్తూ, నవ్వులతో లైట్ మూమెంట్ షేర్ చేస్తున్న ఆ ఫ్రేమ్ అభిమానులకు పండగలా మారింది.
ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… రామ్ చరణ్ తన రాబోయే భారీ సినిమా ‘పెద్ది’ కోసం ధోనీ నుంచి క్రికెట్‌కు సంబంధించిన కొన్ని టిప్స్ తీసుకుని ఉండవచ్చని అభిమానులు ఊహించుకుంటున్నారు. బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా, విజువల్‌గా అద్భుత అనుభూతిని అందించబోతోందని ఇప్పటికే టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రం 2026 మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.